2007 లో తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి ఎంటరయింది కాజల్ అగర్వాల్. తెలుగు ఇండస్ట్రీకొచ్చి దాదాపు 13 ఏళ్ళు అవుతోంది. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత నటించిన చందమామ, మగధీర సినిమాలతో ఏకంగా స్టార్ హీరోయిన్ అన్న పేరు సంపాదించుకుంది. దాదాపు టాలీవుడ్ లో అందరి హీరోలందరి సరసన నటించింది. యంగ్ హీరోల దగ్గర్నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు నటించిన సినిమాలన్ని దాదాపు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

 

IHG

కాజల్ అగర్వాల్ కెరీర్ లో సక్సస్ లే ఎక్కువగా నమోదయ్యాయి. అంతేకాదు తను నటించిన తమిళ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. దాంతో కోలీవుడ్ లో కూడా కాజల్ కి మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలతో నటించిన హీరోయిన్ గా కాజల్ కి మంచి క్రెడిట్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 లో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అయితే కాజల్ ఇప్పుడు ఎక్కువగా సీనియర్, స్టార్ హీరోలందరకి బెస్ట్ ఛాయిస్ గా మారింది.

 

IHG 

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో మరోసారి చిరంజీవి సరసన నటిస్తుంది కాజల్. ఇక తమిళంలోను కమల్ హాసన్ కి జంటగా ఇండియన్ 2 తో పాటు ఏ.ఆర్ మురగదాస్ విజయ్ కాంబినేషన్ లో తుపాకి 2 లోను కాజల్ ని ఎంపిక చేసుకున్నారట. అంతేకాదు మరికొన్ని సీనియర్ హీరోల సినిమాల నుంచి ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తున్నట్టు సమాచారం.

 

IHG

ఇక నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రియమణి ఒకప్పుడు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. కెరీర్ మంచి పీక్స్ లో ఉండగానే పెళ్ళి చేసుకొని సినిమాలకి దూరమైంది. దాంతో ఇక ప్రియమణి ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయిందని అనుకున్నారు. కట్ చేస్తే వెంకటేష్ నారప్ప తో గ్రాండ్  ఎంట్రీ ఇస్తోంది. అంతేకాదు రానా దగ్గుబాటి నటిస్తున్న విరాట పర్వం సినిమాలోను అద్భుతమైన పాత్ర పోషిస్తుంది.

 

IHG

ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలకి నిర్మాత సురేష్ బాబు కావడం  విశేషం. ఇక రీసెంట్గా ప్రియమణి బర్త్ డే సందర్భంగా ఈ రెండు సినిమాల నుంచి ప్రియమణి లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. అప్పటి నుంచి ప్రియమణి కి సీనియర్ హీరోల సినిమాల నుంచి అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: