వెండితెర మీద కనిపించే నటులు తమ ఆరాధ్య దైవాలుగా అభిమానులు భావించడంతో వారు డెమీ గాడ్స్ అయిపోయారు. ఒక్కసారి నింగిన తారలుగా మెరిసాక మళ్ళీ వెనక్కి రావడం కష్టం. ఆ తారలు అలా మెరుస్తూ  మిళమిళకాంతులీనుతూ ఎప్పటికీ అదే కాంతితో ధగధగలాడాలనుకుంటున్నాయి.

IHG

దాంతో వారసులు వస్తున్నారు. వారి కోసం స్టూడియోలు, మరో వైపు లీజుకు ధియేటర్లు, ఇంకో వైపు డిస్త్రిబ్యూషన్ ఇలా అన్ని రంగాల్లోనూ కొన్ని కుటుంబాల పెత్తనం ఉందని అంటున్నారు. తాజాగా సినిమా రంగంలో ఇద్దరు ప్రముఖ హీరోల వివాదమే  కూడా కుటుంబాల గొడవ నుంచి మారి ఇండస్ట్రీ  వివాదంగా మారుతోంది.

IHG

ఆ ఇద్దరు నటుల కుటుంబాలు సినిమారంగంలో స్థిరపడ్డాయి. అయితే సినిమా రంగం అంటే ఆ ఇద్దరే కాదు, చాలా మంది ఉన్నారు ఎంతో మంది శ్రమదానం సినీ పరిశ్రమ అంటారు. తెలుగు సినీ పరిశ్రమ పచ్చగా పదికాలాలు ఉండాలంటే ఇగోలు వదిలేసి భవిష్యత్తు కోసం ఆలోచన చేయాలని అంతా సూచిస్తున్నారు.

IHG

నటులు కోట్లు గడిస్తూంటే జూనియర్ ఆర్టిస్టులు  రోజు కూలి మీద ఇంకా వందల్లోనే బతుకులు ఈడుస్తున్న సన్నివేశాలు అక్కడ కనిపిస్తుంటాయి. అందువల్ల ఏ కొద్ది మంది మేలు మాత్రమే కాకుండా  అందరి విస్త్రుత ప్రయోజనం కోసం అడుగులు ముందుకు సాగాలి. టాలెంట్ ఉంటే నిలదొక్కుకోవచ్చు అన్న భరోసా కల్పించాలి. 

IHG

వారసులు వద్దు అని ఎవరూ అనరు కానీ వారే సర్వశ్వం అన్న తీరున మాత్రం పెత్తనం చేయడం తగదు అంటున్నారు. సినిమా అంటే అందరికీ ఇష్టమే ఆ రంగంలోకి అంతా రావాలనుకుంటారు. ఆ విధంగా సినిమా పరిశ్రమ పదిమందిదీ అనేలా ఉండాలని, ఆ దిశగా పెద్దలు క్రుషి చేయాలని, మాటల తూటాలు పక్కన పెట్టి సమిష్టిగా పనిచేయాలని కూడా సూచనలు అందుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: