అల్లు అర్జున్ ఆఖరిక్షణం తన కట్టె కాలేవరకు తాను చిరంజీవి అభిమానిని అని ఓపెన్ గా అనేకసార్లు చెప్పినా మెగా అభిమానులు బన్నీని పూర్తిగా నమ్మరు. దీనికితోడు బన్నీ అనుకుని చేస్తాడో లేక అనుకోకుండా చేస్తాడో తెలియకపోయినా బన్నీ కొన్ని ఇంటర్వ్యూలలో చేసే కామెంట్స్ అనేక సందేహాలకు ఆస్కారం కలిగిస్తూ ఉంటుంది.


ఈసంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ మూవీ క్రియేట్ చేసిన రికార్డులు ఈసంవత్సరం అంతా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. కరోనా సమస్యతో ధియేటర్లు మూత పడటంతో ఇప్పట్లో ధియేటర్లు తిరిగి తెరుచుకోవడం మళ్ళీ టాప్ హీరోల సినిమాల హడావిడి మొదలు కావడం దసరా వరకు ఉండే ఆస్కారం లేదు.


దీనితో ఈ ఏడాది బన్నీ రికార్డులను బ్రేక్ చేసి మరో భారీ హిట్ వచ్చే ఆస్కారం కనిపించడం లేదు. షూటింగ్ లు లేకపోవడంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న బన్నీ బాలీవుడ్ లో కూడ తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి అనేక వ్యూహాలు రచిస్తున్నాడు. ఈ వ్యూహాలలో భాగంగా ఈమధ్య ఒక ప్రముఖ బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు.  


ఈ ఇంటర్వ్యూలో బన్నీ తనకు నచ్చిన డ్యాన్సర్ గురించి చెప్పాడు. ఇండియాలోనే నంబర్ వన్ డ్యాన్సర్ అనిపించుకున్న చిరంజీవి తన ఫ్యామిలీలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని చెప్పకుండా తన ఫేవరెట్ డ్యాన్సర్ ఒకనాటి క్రేజీ బాలీవుడ్ హీరో గోవింద అని చెపుతున్నాడు. గోవిందా స్టెప్పులు వేస్తుంటే చూపు తిప్పుకోలేనంటూ బన్నీకామెంట్ చేసాడు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తన ఇన్‌స్పిరేషన్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ అమితాబచ్చన్ పేరు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. దీనితో తెలుగు రాష్ట్రాలలో చిరంజీవి పేరు చెపుతూ బాలీవుడ్ కు వచ్చే సరికి అంటే కూడా అమితాబ్ బచ్చన్ పేరు చెపుతూ తెలివిగా వ్యవహరిస్తున్న బన్నీ దేశముదురు తెలివితేటలు చూసి మెగా అభిమానులు ఆశ్చర్య పోతున్నారు..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: