కరోనా రాకతో ధనవంతుల దగ్గర నుండి మధ్య తరగతి వర్గాల ప్రజల వరకు జనం ఆలోచనలు మారిపోయాయి అనీ ఇదివరకు లా విలాసాలకు ఆడంబరాలకు పెద్దగా డబ్బు ఖర్చు పెట్టారు అంటూ అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇది అంతా ఒక వైరాగ్యం మాత్రమే అనీ మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చే సరికల్లా జనం ఆలోచనలు మారిపోయి మళ్ళీ విలాసాల బాట పడతారు అంటూ మరికొందరు విశ్లేషణలు చేసారు.


ప్రస్తుతం కరోనా దెబ్బతో పారిశ్రామిక వేత్తల నుండి సామాన్యుల వరకు సతమతమైపోతున్న పరిస్థితులలో నాగార్జున ఒక అత్యంత విలాసవంతమైన కోరికను తీర్చుకోవడానికి అడుగులు వేస్తున్నాడు అంటూ వచ్చిన ఒక న్యూస్ చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. నాగార్జున హీరోగా మాత్రమే కాకుండా అనేక వ్యాపారాలు చేస్తూ రియల్ ఎస్టేట్ హోటల్ రంగాలలో ఇప్పటికే చాల భారీగా పెట్టుబడులు పెట్టాడు.


వ్యాపార వ్యవహారాలలో ఎటువంటి మొహమాటాలకు పోకుండా ఆచితూచి వ్యవహరించే నాగ్ ఆర్ధిక వ్యవహారాలను నిర్వహించే తీరు చాలవిభిన్నం అని అంటారు. ప్రస్తుతం ఈ లాక్ డౌన్ సమయంలో నాగార్జున తన సొంత కుటుంబానికి ఒక ‘ఫ్లైట్’ కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని వస్తున్న గాసిప్పులు నిజమా కాదా అన్న విషయమై ఇండస్ట్రీ వర్గాలు తమతమ స్థాయిలలో వివరాలు సేకరించే విషయంలో బిజీగా ఉన్నాయి.


ఈమధ్య నాగ్ చెన్నై లోని తన సోదరుడి ఇంటిలో జరిగిన ఫంక్షన్ కు వెళ్లినప్పుడు నాగార్జునకు ఈ ఆలోచన వచ్చింది అన్నప్రచారం జరుగుతోంది. ఇక ఆలోచన రావడమే తడువుగా నాగ్ లేటెస్ట్ విమానాలకు సంబంధించిన మోడల్స్ ఈ కొనుగోలుకు సంబంధించిన విధి విధానాల గురించి నాగ్ చాల లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే టాప్ హీరోలు అంతా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చార్టర్ ఫ్లయిట్ ల్లో వెళ్తున్నారు. ఇప్పుడు నాగ్ ఈ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టే ప్రయత్నాలు చేస్తూ ఉండటంతో రానున్న రోజులలో అనేకమంది టాప్ హీరోలు ఈ ట్రెండ్ ను అనుసరించే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: