కరోనా దెబ్బతో ఫిలిం ఇండస్ట్రీ అతలాకుతలం అయిపోవడంతో వేలకోట్లలో నష్టం వస్తున్నట్లు అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తారాస్థాయి అంచులకు చేరుకుంటూ ఉండటంతో జూలై ఆఖరకు భారత్ లో కరోనా కేసుల సంఖ్య పది లక్షలకు చేరుకుంటుందని అంచనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో సినిమా ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. అయినా ధైర్యం చేసి ఇప్పటికే సగం పైగా పూర్తి అయిన సినిమాలను అలా వదిలేయలేక తిరిగి షూటింగ్ లు ప్రారంభించి పూర్తి చేయాలి అని భావిస్తున్న నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం షూటింగ్ ల ప్రారంభం విషయమై విడుదల చేసిన గైడ్ లైన్స్ అనేకమంది దర్శక నిర్మాతలకు నోటమాట లేకుండా చేస్తున్నాయని టాక్.


షూటింగ్ లో పాల్గొనే ప్రతి వ్యక్తి మాస్క్ లు విధిగా ధరించాలి షూటింగ్ స్పాట్ లో అందరు సామాజిక దూరం పాటిస్తూ షూటింగ్ స్పాట్ లో విధిగా ఒక డాక్టర్ ఉండి తీరాలి. అదేవిధంగా షూటింగ్ లొకేషన్ లో ఎక్కడిక్కడ శానిటైజర్స్ వాడాలి. అదేవిధంగా షూటింగ్ స్పాట్ లో అందరు సిగరెట్ కు గుట్కా కు దూరంగా ఉండాలి. దీనికితోడు షూటింగ్ స్పాట్ లో 40 మంది మించి యూనిట్ సభ్యులు ఉండకూడదు.


అదేవిధంగా 10 సంవత్సరాల లోపు చైల్డ్ ఆర్టిస్టులు 60లు పై బడిన నటీనటులు తమకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడమే కాకుండా వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవనీ డాక్టర్ సర్టిఫికేట్ కూడ జత చేయాలి. అంతేకాకుండా యూనిట్ సభ్యులు అంతా ఎవరికి వారు వారి ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవాలని వీలైనంత వరకు ఎవరి మేకప్ వారే చేసుకోవాలని నిబంధన కూడ పెట్టారు.  


అవుట్ డోర్ లోకేషన్స్ లో కాకుండా ఎక్కువగా ఇన్ డోర్ లోకేషన్స్ లోనే షూట్ చేసుకోవడం మంచిది అని క్లారిటీ ఇస్తూ చిన్న ఆర్టిస్టులకు కూడ ఎవరి మేకప్ కిట్ వారికే ఉండాలి అన్న నిబధన కూడ పెట్టారు. మొన్న విడుదలైన ఈ నిబంధనలు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఇండస్ట్రీ వర్గాలు ఈ గైడ్ లైన్స్ పాటిస్తూ పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు షూటింగ్ లు ప్రారంభించే పరిస్థితి లేదు అంటూ ఎవరికీ వారు చేతులెత్తేస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: