టాలీవుడ్ లో పోకిరి సినిమా ఒక సంచలనం అనే విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా కథ ఈ సినిమాలో మహేష్ బాబు నటన ఈ సినిమాలో ఉండే సన్నివేశాలు ఈ సినిమా విలన్ గా ఉన్న ప్రకాష్ రాజ్ నటన ఇక చివరిలో ఉండే సినిమా క్లైమాక్స్ అన్నీ కూడా ఒక సంచలనం అనే సంగతి తెలిసిందే. మహేష్ బాబుకి ఈ సినిమా తీసుకొచ్చిన పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. వసూళ్ళ పరంగా కూడా మహేష్ బాబు కి అప్పట్లో ఈ సినిమా బాగా ప్లస్ అయింది అనే విషయం తెలుసు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా మహేష్ బాబు కి ఫ్యాన్ ఫాలోయింగ్ ని బాగా పెంచడమే కాదు మహేష్ ని మాస్ కి బాగా దగ్గర చేసింది అనే విషయం చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎక్కువగా మాస్ ని ఆకట్టుకునే సినిమాలే చేస్తూ వచ్చాడు. మహేష్ ఆ తర్వాత చేసిన దూకుడు లాంటి సినిమా కూడా మాస్ కి బాగా దగ్గరైంది అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో మహేష్ నటన కు అవార్డ్ లు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇనిమా తర్వాత మహేష్ బాబు ఇక వెనక్కు తిరిగి చూసుకునే పరిస్థితి ఎక్కడా కూడా ఏ సందర్భం లో కూడా రాలేదు అనే చెప్పాలి అని అంటారు. 

 

సినిమా అతని కెరీర్ కి చాలా వరకు ప్లస్ అయింది అనే అంటారు మహేష్ అభిమానులు కూడా. ఈ సినిమా తర్వాత అతను కథల ఎంపికలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని సినిమాల ను నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: