యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన సినిమా మిర్చి. అప్పటివరకు రైటర్ గా పనిచేసిన కొరటాల శివ డైరక్టర్ గా చేసిన మొదటి ప్రయత్నమే మిర్చి. అప్పటివరకు ప్రభాస్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా ఈ సినిమాలో రెండు వర్గాల మధ్య పోరుని చాలా క్లాస్ గా చూపించాడు కొరటాల శివ. ఊర మాస్ కథ అయినా తన మార్క్ తో క్లాస్ హిట్ అందుకున్నాడు కొరటాల శివ. ఈ సినిమాలో ప్రభాస్ స్టైల్ అదిరిపోయింది. 

 

సినిమా తర్వాత ప్రభాస్ బాహుబలి రెండు పార్వతుల కోసం ఐదేళ్లు రాజమౌళికి కేటాయించాడు. మిర్చి సినిమాతో ప్రభాస్ క్రేజ్ డబుల్ అయ్యింది. అంతేకాదు ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ తన రేంజ్ ఏంటన్నది ప్రూవ్ చేసుకున్నాడు. కథ, కథనాలు కమర్షియల్ మాస్ అంశాలతో రాసుకున్న కొరటాల శివ దాన్ని తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలిచింది. మిర్చి లాంటి కుర్రాడే బిట్ సాంగ్.. కాటుక కళ్ళను చూస్తే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. 

 

మిర్చి సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది. అప్పటికే ప్రభాస్, అనుష్క జోడీ సూపర్ హిట్ అనిపించుకోగా ఈ ఇద్దరి హాట్ జోడీ మరోసారి ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. మిర్చి తర్వాత కొరటాల శివ మహేష్ తో శ్రీమంతుడు సినిమా తీశాడు. ఆ సినిమా కూడా సోషల్ మెసేజ్ ఇస్తూనే కమర్షియల్ సక్సెస్ అందుకుంది. విలేజ్ ఎడాప్షన్ కాన్సెప్ట్ మీద సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: