టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ సినిమా వస్తు౦ది అంటే చాలు ఆయన అభిమానులతో పాటుగా ఆయన సినిమాలను ప్రత్యేకంగా చూసే ఫాన్స్ కి కూడా పండగ అనే విషయ౦ అందరికి తెలిసిందే. ఇక ఆయన కెరీర్ లో చేసిన కొన్ని కొన్ని సినిమాలు ఆయనకు చాలా బాగా మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చాయి అనే చెప్పాలి. సింహాద్రి నుంచి నిన్న ఆమొన్న వచ్చిన అరవింద సమేత సినిమా వరకు కూడా ఆయనకు మాస్ ఇమేజ్ ని తీసుకోచ్చిన సినిమాలే ఎక్కువగా  మనకు కనపడతాయి. 

 

ఇక ఎన్టీఆర్ కెరీర్ లో మాస్ ఇమేజ్ ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్ళిన సినిమా అశోక్. ఈ సినిమాలో అతని నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా అతను ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాడు అనేది వాస్తవం. ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులకు ఇంకా గుర్తు ఉంది అనే చెప్పాలి. ఈ సినిమాలో అతని నటన ఒక హైలెట్ అయితే దర్శకుడు మాస్ కి దగ్గరయ్యే విధంగా విలన్ ని కూడా ఉంచాడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమా అప్పుడు ఫ్లాప్ అయింది గాని ఇప్పటికి టీవీ లో వచ్చినా సరే చాలా మంది చూస్తూ ఉంటారు అనేది వాస్తవం. 

 

అతని కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సినిమాలో ఉండే అతని లుక్ కూడా మాస్ కి బాగా దగ్గరైంది. అందుకే ఈ సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే జనాలు అదే విధంగా చూస్తూ ఉంటారు అని అంటారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: