అరవింద సమేత వీర రాఘవ చిత్ర కథని త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాడు. రాయలసీమ నేపథ్యంలో కొనసాగే ఈ కథకి కోబలి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఏవో కారణాల వలన పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో నటించలేదు. దాంతో ఎప్పటి నుండో మూలనపడ్డ తన కథ ను జూ. ఎన్టీఆర్ కు వినిపించగా... ఆయన ఓకే చెప్పేయగా... అరవింద సమేత వీర రాఘవ సినిమా తెరకెక్కింది. 2018 అక్టోబర్ 11వ తేదీన తెరకెక్కిన ఈ సినిమాలో రాయలసీమలోని నల్ల గుడి, కొమ్మది గ్రామాల మధ్య కొనసాగే బీభత్సమైన గొడవలు జరిగితే ఎలా ఉంటాయో అని త్రివిక్రమ్ శ్రీనివాస్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. పూర్తి కల్పితమైన కథాంశం అయినప్పటికీ రాయలసీమ ప్రజలు మాత్రం తమ గురించి తప్పుగా చూపిస్తున్నారని ఈ సినిమా పై దుమ్మెత్తి పోశారు. 


ఈ చిత్రంలో ఎన్టీఆర్ హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఫైట్ సన్నివేశాల్లో చాలా ఎనర్జిటిక్ గా కత్తులతో సమరం చేసి వావ్ అనిపించాడు. ఫైట్ సన్నివేశాల్లో చాలా షాట్స్ అసహజంగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఫుల్ యాక్షన్ రోల్ అభిమానులకు మాత్రం బాగా థ్రిల్లింగ్ గా అనిపించింది. గత పది సంవత్సరాలలో అరవింద సమేత వీర రాఘవ వంటి ఫుల్ లెంత్ ఫ్యాక్షన్ సినిమా రాలేదని చెప్పుకోవచ్చు. కొడవళ్లతో, కత్తులతో జూనియర్ ఎన్టీఆర్ తన ప్రత్యర్థులను అరటి చెట్లను నరికినట్టు నరుకుతూ రక్తాన్ని తన తొడకి తుడుచుకోవడం అభిమానుల హార్ట్ బీట్ పెంచేసిందని చెప్పుకోవచ్చు. 


ఎస్.ఎస్ తమన్ అందించిన సంగీతం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా పెనివిటి పాటకు ఎస్ తమన్ అందించిన సంగీతం సూపర్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా వెంట్రుకలు నిక్క పొడిచేలా ఉన్నాయంటే నమ్మండి. కామెడీ, లవ్ స్టోరీ అంతగా లేని ఎమోషనల్ డ్రామా గా అరవింద సమేత సినిమాని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించాడు. దాంతో రెగ్యులర్ ప్రేక్షకులకి ఈ సినిమా అంతగా నచ్చలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: