మన తెలుగులో చాలా తక్కువ కాలంలో మాస్ ఆడియన్స్ ని సంపాదించుకున్న హీరోలు కొందరే ఉన్నారు. చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా సరే వాళ్లకు మాత్రం మాస్ ఇమేజ్ మాత్రం చాలా బాగా వచ్చింది అనే చెప్పాలి. ఇక అక్కినేని హీరోలకు ముందు నుంచి కాస్త మాస్ ఇమేజ్ తక్కువ అనే విషయం అందరికి తెలిసిందే. ఇక అక్కినేని హీరోల్లో చాలా వరకు క్లాస్ సినిమాలు చేస్తారు కాబట్టి దర్శక నిర్మాతలు కూడా అదే విధంగా చూస్తూ ఉంటారు వాళ్ళను అనేది అందరికి తెలిసిందే. ఇక అది పక్కన పెడితే మాస్ ఆడియన్స్ ని అక్కినేని ఫ్యామిలీ లో చాలా తక్కువ కాలంలో సంపాదించుకున్న హీరో నాగ చైతన్య. బాబు కి చాలా తక్కువ కాలంలో మాస్ కి దగ్గరయ్యే విధంగా గుర్తింపు వచ్చింది. 

 

చాలా వరకు మాస్ సినిమాలే అతను చేసాడు కూడా. ఇక అది పక్కన పెడితే అతనికి విజయవాడ బ్యాక్ గ్రౌండ్ నేపధ్యంలో చేసిన ఒక సినిమా బాగా మాస్ కి దగ్గర చేసింది. విజయవాడ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన ఆటోనగర్ సూర్య సినిమా అతనికి చాలా  మంచి గుర్తింపు తీసుకొచ్చింది అనే మాట వాస్తవం. ఈ సినిమాలో అతని నటన తో పాటుగా సినిమాలో ఉండే సన్నివేశాలు అన్నీ కూడా మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యే విధంగానే ఉన్నాయి అనేది వాస్తవం. ప్రతీ సీన్ ని కూడా అదే విధంగా తీసుకొచ్చారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

 

సినిమా ఫ్లాప్ అయినా సరే ఇప్పటికి కూడా టీవీ లో వస్తే  కచ్చితంగా చూస్తూ ఉంటారు అభిమానులు ప్రేక్షకులు. కాగా ఇప్పుడు అతను లవ్ స్టోరీ అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: