నంద‌మూరి బాల‌కృష్ణ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. బాలకృష్ణ టాప్ హిట్ మూవీస్‌లో మ‌న‌కు రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కిన స‌మ‌ర‌సింహారెడ్డి, న‌ర‌సింహ‌నాయుడు చిత్రాలు ముందు వ‌రుస‌లో కనపడుతాయి. బాల‌కృష్ణ ఎఫెక్ట్‌తో ఓ స‌మ‌యంలో ఫ్యాక్ష‌నిస్ట్ సినిమాలే ఎక్కువ‌గా వ‌చ్చాయి. మాస్ యాక్షన్ సినిమాలతో  ప్రేక్షకులకు బాలయ్య మరింత దగ్గర అయ్యారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా కథ ఉండటంతో విమర్శకుల ప్రసంశలు కూడా దక్కాయి. 

 

 

తెలుగు సినిమా చరిత్ర‌లో ట్రెండ్ సెట్ట‌ర్‌గా నిలిచిపోయే సినిమాలలో న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ‘స‌మ‌ర‌సింహారెడ్డి’ ఒక‌టి. ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో… కొన్నేళ్ళ పాటు తెలుగు సినిమా ఫ్యాక్ష‌న్ బాట ప‌ట్టింది. మ‌రికొన్ని ఘ‌న‌విజ‌యాల‌నూ మూట‌గ‌ట్టుకుంది. న‌వ‌ర‌సాల‌ను అద్భుతంగా ప‌లికించి అభిమానుల చేతే కాదు స‌గ‌టు ప్రేక్ష‌కుల నుంచి కూడా జేజేలు అందుకున్నాడు.ఇక ‘స‌మ‌ర‌సింహారెడ్డి’ విష‌యానికొస్తే నంద‌మూరి బాల‌కృష్ణలోని న‌టుడ్ని కొత్త‌గా ఆవిష్క‌రించిన చిత్ర‌మిది.

 

 

బాల‌కృష్ణ మ‌ణిశ‌ర్మ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తొలి చిత్ర‌మిది. ఆ త‌రువాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో 11 చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో `న‌ర‌సింహ‌నాయుడు`, `ల‌క్ష్మీ న‌ర‌సింహా` మంచి విజ‌యం సాధించాయి. బాల‌కృష్ణకి జోడీగా తొలిసారిగా సిమ్రాన్‌, అంజ‌లా ఝ‌వేరి, సంఘ‌వి న‌టించిన సినిమా ఇది. వీరిలో సిమ్రాన్ మాత్ర‌మే త‌ద‌నంత‌ర కాలంలో బాల‌య్య‌కి హిట్ పెయిర్ అనిపించుకుంది.

 

 

బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను…శ్రీ స‌త్య‌నారాయ‌ణమ్మ‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై చెంగ‌ల వెంక‌ట‌రావు నిర్మించారు. ఈ చిత్రానికి ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అందించిన సంభాష‌ణ‌లు అద‌న‌పు బ‌లంగా నిల‌చాయి. ఇక మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ‘చ‌లిగా ఉంద‌న్నాడే’, ‘అడీస్ అబ్బ‌బ్బా’, ‘లేడీ లేడీ క‌న్నెలేడీ’, ‘అందాల ఆడబొమ్మ‌’, ‘రావ‌య్య ముద్దుల‌మామ‌’, ‘నంద‌మూరి నాయ‌కా’… ఇలా ప్ర‌తీ పాట మాస్ ప్రేక్ష‌కుడ్ని క‌ట్టిప‌డేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: