తెలుగు చిత్ర పరిశ్రమలో యూత్ ఐకాన్ అంటే వినపడే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన సినిమాలలో ఉన్న మెసేజ్ యువతను ఆకట్టుకుంటుంది అని వేరేలా చెప్పనక్కర్లేదు..సినిమాలలో పవన్ కళ్యాణ్ స్టయిల్, మ్యానరిజం చూపరుల దృష్టిని అమాంతం లాగేసుకుంటుంది అని అందరికీ తెలిసిన విషయమే..మెగాస్టార్ తమ్ముడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసి ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..

 

 


తొలి ప్రేమ , జానీ, తమ్ముడు, బద్రీ లాంటి హిట్ సినిమాలలో నటించిన పవన్ కళ్యాణ్ వరుస హిట్ సినిమాలతో ఒక్కసారిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అబ్బాయిలను మాత్రమే కాదు అమ్మాయిలను కూడా ఆకట్టుకుంది..అమ్మాయిల కలల రాకుమారుడు పవన్ కళ్యాణ్ అయ్యారంటే నమ్మండి.. పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలలోనే కాదు బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. జనసేన పార్టీ పెట్టే జనాల కష్టాలను తెలుసుకున్నాడు. అందుకే పవన్ అంటే యువతకు ఎనలేని అభిమానం..

 

 

 

పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికొస్తే.. పవన్ యూత్ ను ఆకట్టుకునే విధంగా సినిమాలను చేస్తూ వస్తున్నారు.. అయితే అతనికి మాస్ యాక్షన్ టాక్ ను అందించిన సినిమా అంటే అది గబ్బర్ సింగ్ అని అభిమానులు చెప్తున్నారు..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించాడు..రౌడీల పని పట్టే విధంగా ఆయన పాత్ర ఉంటుంది. పోలీసు కు ఉండాల్సిన లక్షణాలను కళ్ళకు కట్టినట్లు పవన్ చూపించారు. దాంతో యువతను ఆకట్టుకున్న ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా రాబట్టింది..ప్రస్తుతం దిల్ రాజ్ నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్నాడు.. హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న పింక్ సినిమా రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది..ఈ సినిమా పవన్ కు ఏ మాత్రం హిట్ ని అందిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: