గత ఏడు సంవత్సరాలలో బాలకృష్ణ సినిమా కెరీర్ లో అతి పెద్ద హిట్ అయిన సినిమా ఏదైనా ఉందంటే అది లెజెండ్ అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. లెజెండ్  సినిమాలో బాలకృష్ణ కృష్ణ పాత్రలో నటించగా అతడు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాడు. కృష్ణ ఒక ఎన్ఆర్ఐ కాగా... తాను తన కుటుంబ సభ్యులతో బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటాడు. 


ఆ అనుబంధంతోనే తను ప్రేమించిన అమ్మాయిని ఇండియా లోని తన నానమ్మ వద్దకు తీసుకొస్తాడు. ఈ క్రమంలోనే కృష్ణ కొంతమంది చెడ్డ వారిని చితకబాదగా... వాళ్లందరికీ బాస్ ఐన జితేంద్ర (జగపతి బాబు) కృష్ణ పై ఎటాక్ చేయాలనుకుంటాడు. అయితే వీరిద్దరికీ ఎప్పటినుండో పగలు, ప్రతీకారాలు ఉన్నాయనే విషయం ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపించాడు బోయపాటి శ్రీను. ఈ క్రమంలోనే పెద్ద బాలకృష్ణగా జయ్ దేవ్ ఎంట్రీ ఇస్తాడు. అనంతరం వాళ్ళిద్దరి మధ్య ఎలా యుద్ధం జరిగిందనేది ఈ సినిమాలో చూపించబడుతుంది. 


ఈ సినిమాలో బాలకృష్ణ పర్ఫామెన్స్ అదుర్స్ అని చెప్పుకోవచ్చు. జయదేవ్ పాత్రలో కనిపించిన బాలకృష్ణ మేనరిజం, రాయల్ లుక్ అభిమానులకు కన్నుల విందు అయ్యాయి. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన టైం బాంబు సాంగ్ లో బాలయ్య స్టెప్పులకు అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. నీ కంటి చూపులతో అనే పాట ఎంత హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జగపతి బాబు ప్రతినాయకుడిగా చించేశాడు అని చెప్పుకోవచ్చు. ఈ చిత్రంలో నటించిన సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే చాలా అందంగా కనిపించారు. ఫస్టాఫ్ కాస్త స్లో గా కొనసాగినా సెకండాఫ్ లో బాలకృష్ణ చెప్పిన పంచ్ డైలాగులు, ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ట్రైన్ ట్రాక్ ఫైట్ సన్నివేశం దుమ్ము రేపింది అని చెప్పుకోవచ్చు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న లెజెండ్ సినిమా ని ఒక్కసారైనా చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: