టాలీవుడ్ లో ఒకప్పుడు వెంకటేష్ సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులకు ఒకరకంగా పండగ. ఆయన సినిమాల కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూసే వారు. ముఖ్యంగా మహిళా అభిమానులు అయితే ఆయన సినిమాల కోసం ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అనే చెప్పాలి. ఆయనకు ఆ విధంగా కొన్ని కొన్ని సినిమాలు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి అనేది వాస్తవం. ఇక ఆయన కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు చేసారు. అయితే ఆయనకు మాత్రం మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఒకటి ఉంది. 

 

అది ఏంటీ అంటే కూలి నెంబర్ 1. ఈ సినిమాలో ఆయన  నటనకు చాల ఆమంచి మార్కులు పడ్డాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఉండే చాలా సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అప్పట్లో అనేది వాస్తవం. ప్రతీ సీన్ కూడా మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా ఉంది అనేది వాస్తవం. ఇక నా బిళ్ళ కూడా ఊడదు అంటూ వెంకటేష్ మాట్లాడిన మాటకు ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఫిదా అవుతూ ఉంటారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. సినిమా నిర్మాణ సంస్థకు కూడా చాలా మంచి లాభాలు తీసుకొచ్చింది ఈ సినిమా అనేది వాస్తవం. 

 

ఈ సినిమాలో ఆయన నటన కూడా చాలా ఆకట్టుకోవడంతో ఆయన తో సినిమాల చేయడానికి అప్పట్లో అగ్ర దర్శక నిర్మాతలు ఎక్కువగా పోటీ పడ్డారు అనే చెప్పాలి. కాగా వెంకటేష్ ఇప్పుడు నారప్ప అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల  ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాతః ఆయన ఏ సినిమాలో నటిస్తారు అనేది ఇంకా తెలియదు. త్వరలోనే దానిపై ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: