హీరోగా ఎన్ని సినిమాలు చేసినా స్టార్ ఇమేజ్‌ అందుకోవాలంటే మాత్రం మాస్‌ హిట్ పడాల్సిందే. అందుకే ఈ జనరేషన్‌ యంగ్ హీరోలు కూడా మాస్‌ హిట్ కోసం తెగ కష్టపడుతున్నారు. రొమాంటిక్‌ హీరోలు, లవర్‌ బాయ్స్ గా ముద్ర పడ్డ హీరోలు కూడా మాస్ ఇమేజ్‌ కోసం తంటాలు పడుతున్నారు. ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన నటుడు అక్కినేని వారసుడు నాగచైతన్య. యూత్‌ ఫుల్‌ ఎంటర్ ‌టైనర్‌ జోష్ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తరువాత వరుసగా రొమాంటిక్ సినిమాలతో సక్సెస్‌ సాధించాడు.

 

ఏం మాయ చేసావే, 100% లవ్‌ సినిమాలతో బ్లాక్‌ బస్టర్ విజయాలను అందుకొని రొమాంటిక్‌ హీరోగా ఫిక్స్ అయిపోయాడు. కానీ స్టార్ హీరోగా అనిపించుకోవాలంటే మాస్ హిట్ ఉండాలని భావించిన చైతూ.. దడ, బెజవాడ లాంటి సినిమాలతో నిరాశపరిచాడు. తడాకా మాస్‌ హిట్ దక్కినా ఆ క్రెడిట్ పూర్తిగా చైతూ ఖాతా లో పడలేదు. దీంతో రూట్ మార్చి తిరిగి రొమాంటిక్ హీరోగా సక్సెస్‌ అయ్యాడు. మనం, ఒక లైలా కోసం, ప్రేమమ్ లాంటి సినిమాతో తిరుగులేని రొమాంటిక్ ఇమేజ్‌ సాధించి తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.

 

రొమాంటిక్‌ హీరోగా సూపర్‌ సక్సెస్ ‌లు దక్కినా మాస్ హీరోగా ప్రూవ్‌ చేసుకోవాలన్న కోరిక మాత్రం తీరలేదు. దీంతో నాగచైతన్య మరోసారి యుద్ధం శరణం, సవ్యసాచి లాంటి సినిమాలతో మాస్ ఇమేజ్‌ కోసం ప్రయత్నం చేశాడు. అయితే చైతూ కోరిక మాత్రం తీరలేదు. తిరిగి మజిలీ లాంటి రొమాంటిక్ డ్రామాతో మరో బ్లాక్‌ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకీ మామ లాంటి కామెడీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకున్న చైతూ, ప్రస్తుతం లవ్‌ స్టోరీ సినిమాలో నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: