తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు అగ్ర హీరోలుగా కొనసాగుతున్న హీరోలందరూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని వచ్చిన వారే..సినిమాలో ఛాన్స్ కోసం స్టూడియో ల వెంట చెప్పులు అరిగేలా తిరిగి ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా నటించి ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తో పాటుగా చిత్ర పరిశ్రమలో మంచి మార్కెట్ ను ఏర్పరచుకున్నారు..మొదట చిన్న రోల్స్ చేస్తూ ఇప్పుడు టాప్ హీరోలుగా పాపులర్ అయ్యారు..అందుకే ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తున్నారు. ఇకపోతే తెలుగు అగ్ర హీరోలు అందరూ కూడా అలా కష్టాలను ఎదుర్కొంటూ పైకొచ్చిన వాళ్ళే .. వారిలో ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకొచ్చిన హీరోలు చాలా మంది  ఉన్నారు.

 

 


ఆ వరుసలోకి నాని, రవి తేజ , ఉదయ్ కిరణ్ , నితిన్,సునీల్, వేణు ఇలా చాలా మంది హీరోలు వస్తారని చెప్పాలి.. కష్టపడింది ఊరికే పోదు అన్న మాట నిజమైంది. ఇప్పుడు వారి సినిమాలను ప్రజలు ఆదరిస్తున్నారు.. కింద స్థాయి నుంచి పైకొచ్చిన హీరోలలో  చిరంజీవి తర్వాత వినపడే పేరు రవితేజ. సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చిన రవి తేజ పెద్ద హీరోల సినిమాలలో సైడ్ యాక్టర్ గా నటించాడు. తన నటన ను మెచ్చిన దర్శక నిర్మాతలు హీరోగా ఛాన్స్ ఇచ్చారు.. నీ కోసం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు..ఆ సినిమా మంచి హిట్ ని అందుకోవడంతో తర్వాత  ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాలో నటించాడు..ఆ సినిమా కూడా హిట్ టాక్ ను అందుకోవడంతో వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

 

 


2002 లో వచ్చిన ఇడియట్ సినిమాతో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు..అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి మాస్ మహారాజ గా పేరు సంపాదించుకున్నాడు. అతని సినీ కెరియర్ లో వెంకీ సినిమా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యాక్షన్, రొమాంటిక్ కథతో రూపొందిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఆయన సినిమాలలో బెస్ట్ మూవీగా  ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది..ఇకపోతే ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు. చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: