టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ నిత్యా మీనన్. అగ్ర హీరోలతో సినిమాలు చేస్తూ చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా సరే ఆమె చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. లావుగా ఉన్నా సరే చాలా క్యూట్ గా ఉంటుంది అనే పేరు కూడా ఆమెకు సొంతం. ఆమెకు మంచి అవకాశాలు కూడా మన తెలుగులోనే కాదు తమిళంలో అలాగే హిందీ లో కూడా వస్తు ఉన్నాయి. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే ఆమెను ఎంపిక చేస్తున్నారు. 

 

అగ్ర హీరోల సినిమాల విషయంలో ఆమె ఇప్పుడు కాస్త అసహనంగా ఉంది అనే ప్రచారం జరుగుతుంది. తనకు ఛాన్స్ లు ఇచ్చినా సరే పక్కన ఏదో చిన్న పాత్ర ఇస్తున్నారు అని అందుకే తాను ఇంకా హీరోయిన్ గా చేయవద్దు అనే ఆలోచనలో ఉంది అని సమాచారం. ఆమె ఇక క్యారెక్టర్ పాత్రలు చేయడానికి గానూ సిద్దమైంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఆమె  మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో ఆఫర్లు వచ్చినా సరే వద్దు అని చెప్తుంది అని సమాచారం. ఇక ఆమెకు బాలీవుడ్ లో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. 

 

అక్కడ ఆమె వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. అగ్ర హీరోల సినిమాల్లో కూడా ఆమెకు మంచి పాత్రలు వస్తున్నాయి. ఆమె ఎక్కువగా నటన కు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే చెయ్యాలి అనే ఆలోచనలో ఉంది అని తెలుస్తుంది. అందుకే ఇప్పుడు అవకాశాలు వచ్చినా సరే ఆ విధంగా మాత్రమే సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఆమె మన తెలుగులో ఒక సినిమా మాత్రమే చేస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: