కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పెంగ్విన్.  ఓ తల్లి కథ గా ఎమోషనల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది. అంతేకాదు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ అవుతున్న మొదటి పెద్ద సినిమా కూడా ఇదే. ఇక పెంగ్విన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం నాని విడుదలచేశాడు.
 
ట్రైలర్ చూస్తుంటే మరో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చుడనున్నామని అనిపిస్తుంది. అడివిలో తప్పిపోయిన కొడుకు కోసం వెతికే తల్లిగా కీర్తి మరో వైపు అదే అడవిలో ఓ సైకో .. ఈక్రమంలో కీర్తికి ఎదురైన సవాళ్లు ఏంటి ఇదే పెంగ్విన్ కథ. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా మళయాలంలో కూడా విడుదలకానుంది.  
 
ఇక పెంగ్విన్ ట్రైలర్ ను చూసిన నాని..ట్రైలర్ సూపర్ గా ఉందని సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని ట్వీట్ చేశాడు. నూతన దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్నిపేట డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: