టాలీవుడ్ లో ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు పరిచయం అయ్యారు.. కాని కొద్ది మంది మాత్రమే తమ కెరీర్ దీర్ఘకాలం పాటు కొనసాగించారు.  అలాంటి హీరోయిన్స్ లో ఒకరు హన్సిక.  బాలీనటిగా పరిచయం అయిన హన్సిక డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ‘దేశముదురు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.  ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటించింది.  ఆ తర్వాత ఎక్కువగా తమిళ సినిమాల్లో నటిస్తూ,.. చెన్నైలో సెటిలైన భామ హన్సిక... తమిళ్ లో బిజీగా ఉన్న ఈ భామ, తెలుగులో సైతం అప్పుడప్పుడు తళుక్కున మెరిసి అలరిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అదిరిపోయే ఫోటోలు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.

IHG

ఆ మద్య తమిళ హీరో శింబుతో ఎఫైర్ కొనసాగించినట్లు వార్తలు వచ్చాయి.. కానీ ఈ అమ్మడు వాటన్నింటిని కొట్టి పడేసింది.  ఇక హ‌న్సిక త్వ‌ర‌లో పెళ్లిపీట‌లెక్క‌నున్న‌ట్లు కోలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వ్యాపార‌వేత్త‌ను వివాహం చేసుకోనున్న‌ట్లు చెబుతున్నారు.  గత కొంత కాలంగా వ‌రుస ప‌రాజ‌యాల‌తో టాలీవుడ్‌కు దూర‌మైంది హ‌న్సిక‌.  త‌మిళంలో ఆమె న‌టిస్తున్న సినిమాలు ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాలతో ఆగిపోయాయి. చేతిలో కొత్త సినిమాలేవీ లేక‌పోవ‌డంతో  సినీకెరీర్‌కు గుడ్‌‌బై చెప్పి నూత‌న జీవితాన్ని మొద‌లుపెట్టాల‌నే ఆలోచ‌న‌లో ఆమె ఉన్న‌ట్లు చెబుతున్నారు.

IHG', <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HANSIKA MOTWANI' target='_blank' title='hansika motwani-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hansika motwani</a> slams <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BIGBOSS' target='_blank' title='bigg boss-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>bigg boss</a> 11 ...

 లాక్‌డౌన్‌కు ముందే హ‌న్సిక‌ వివాహం నిశ్చ‌య‌మైన‌ట్లు, క‌రోనా ప్ర‌భావంతో వాయిదా ప‌డిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ పెళ్లి వార‌ల‌పై హ‌న్సిక స్పందించింది. అవన్నీ ఒట్టి పుకార్లు ఎలా రాస్తారో నాకు తెలియదని... ఏదైనా విషయం ఉంటే తానే అనౌన్స్ చేస్తానని అంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. అంతే కాదు ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకునే ఆలోచ‌న లేదంటూ తెలిపింది.  తమిళంలో అయితే ఇప్పుడు పరవాలేదు అనిపించుకుంటున్న ఈ చిన్నది పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: