నందమూరి బాలయ్య బాబు 60వ పుట్టినరోజు సందర్భంగా పలు ఇంటర్వ్యూలలో బాలయ్య బాబు పాల్గొని అనేక విషయాలు ఇటీవల తెలియజేయడం జరిగింది. చాలా ఇంటర్వ్యూలలో సినిమా రంగానికి సంబంధించి అదేవిధంగా రాజకీయ రంగానికి సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నమైన గానీ ఎక్కువగా మాత్రం రిపీట్ అయిన ప్రశ్న కొడుకు వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ. ఈ విషయంలో బాలయ్య బాబు ఒక్కో ఛానల్ కి ఒక్కో రకంగా ఆన్సర్ ఇవ్వడం గమనార్హం. ఒక చానల్ లో అయితే సరైన స్క్రిప్ట్ రెడీ గా ఉంటే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉంటుందని బాలయ్య బాబు చెప్పుకొచ్చారు.

IHG

మరొక ఛానల్ ఇంటర్వ్యూలో అయితే ఈ ఏడాది గాని వచ్చే ఏడాది గాని మోక్షజ్ఞ ఎంట్రీ ఉండదని తేల్చేశారు. నందమూరి కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం 2022 తరువాత నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. జాతకరీత్యా నందమూరి మోక్షజ్ఞ కి 30 సంవత్సరాల నుండి దశ బాగుంటుందని అందువల్ల బాలయ్య బాబు 30 సంవత్సరాల వయస్సులో నందమూరి మోక్షజ్ఞ ని సినిమా ఫీల్డ్ లోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు టాక్.

IHG

ఇప్పటికే నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఎప్పుడు ఎప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో 30 సంవత్సరాలు అనే వార్త విని ఒక్కసారిగా సోషల్ మీడియాలో షాక్ తింటున్నారు. మరోపక్క ఇటీవల బాలయ్య వేడుకలో కనబడిన మోక్షజ్ఞ గతంలో కంటే చాలా ఫిట్ గానే కొద్దిగా కనబడటంతో నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నరు.    

మరింత సమాచారం తెలుసుకోండి: