ఇప్పటికే మెగా ఫ్యామిలీని నుంచి దాదాపు 10 మంది దాకా హీరోలు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్‌ల ఫ్యామిలీలతో పాటు ఇటీవల మెగాస్టార్‌ అల్లుడు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మెగాస్టార్‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్‌ విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే హీరో గా ప్రూవ్‌ చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్‌.

 

అయితే ఆ సినిమా కమర్షియల్‌ గావర్క్‌ అవుట్‌ కాకపోవటంతో రెండో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తొలి సినిమాగా మెసేజ్‌ ఓరియంటెడ్‌ కథను ఎంచుకున్న కళ్యాణ్ దేవ్, రెండో సినిమాకు కమర్షియల్‌ ఫార్మాట్‌ను ఎంచుకున్నాడు. సూపర్‌ మచ్చి పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్‌. ఈ సినిమాలో రియా చక్రవర్తి, రచితా రామ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

పులివాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రిజ్వాన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తుండగా తమన్‌ సంగీతమందిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా ఆగిపోయింది. దీంతో ఇంటికే పరిమితమైన కళ్యాణ్ దేవ్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు.

 

తాజాగా తన వర్క్‌ అవుట్స్‌కు సంబంధించి ఓ పోస్ట్‌ ను షేర్ చేశాడు కళ్యాణ్ దేవ్. జిమ్‌లో చెమటోడుస్తున్న ఫోటోతో పాటు `డియర్‌ ఫాట్‌, చచ్చిపోవడానికి సిద్ధంకా` అంటూ కామెంట్ చేశాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Dear Fat, prepare to die!

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) on

మరింత సమాచారం తెలుసుకోండి: