ఈ విపత్కర సమయంలో నానా అవస్థలు పడుతున్న ప్రజలకు రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల తన వంతుగా సహాయం చేస్తోంది. మొన్నామధ్య శ్రీశైలం జిల్లా పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసి తన గొప్ప మనసును చాటుకుంది. ఆమె నిత్యావసర సరుకులు అందిస్తూనే ఆ చెంచు గిరిజనుల జీవనశైలిని, వారు నివసించే గృహాలను చాలా శ్రద్ధగా పరిశీలించింది. అలాగే ఆ గిరిజన ప్రజలతో కాసేపు ముచ్చటించింది. వారు పెంచుకునే మేక పిల్లలను కూడా ఎత్తుకుంది. అయితే ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు ప్రాంతంలో శ్రీశైలం జిల్లాలో ఆమె తన పర్యటనకు సంబంధించిన ఒక ఫోటో ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకొని చెంచు గిరిజనుల సంస్కృతి, ఆహార అలవాట్లపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 


''క్యూట్ గా ఉన్న ఈ రెండు మేక పిల్లలు చెంచు గిరిజన ప్రజలకు త్వరలోనే సంతృప్తికరమైన ఆహారం అవ్వబోతున్నాయి. ప్రజల సంస్కృతిని, వారి ఆహారపు అలవాట్లను గౌరవించడం నేను నేర్చుకున్నాను. మన విశ్వాసాలను, అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం సరైనది కాదు. ఆరోగ్యకరమైన, నైతికమైన ఆహారపు అలవాట్లను ప్రతి ఒక్కరూ అలవరచుకునేలా మనం ఒక సందేశాన్ని నలు మూలల వ్యాప్తి చేయాలి', అని ఆమె ట్విట్టర్ వేదికగా పేర్కొంది.


ఫేసుబుక్ లో కూడా ' మాంసాన్ని తినండి కానీ మితంగా తినండి. ఆ మాంసం ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలుసుకోండి. మన గ్రహం, శరీరం మనం తీసుకునే ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని సరైన ఆహారపు అలవాట్ల నిర్ణయాలు తీసుకునేలా చేయాలి', అని ఆమె పేర్కొంది. 


ఇకపోతే ఉపాసన సోషల్ మాధ్యమాలలో చాలా చురుగ్గా ఉంటూ యోగ, మెడిటేషన్, వ్యాయామం, వంటకాలు ఎలా చేయాలో కూడా చాలా వివరంగా ప్రజలకు తెలియ పరుస్తుంది. ఏది ఏమైనా కేవలం రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకుంటుంది ఉపాసన.

మరింత సమాచారం తెలుసుకోండి: