ఈ మధ్య కాలంలో ఓటీటీ కి డిమాండ్ బాగా పెరిగిన సంగతి తెలిసిందే. చిన్న హీరో సినిమా అయినా పెద్ద హీరో సినిమా అయినా సరే ఓటీటీ లో విడుదల అయిన తర్వాతః దాని రేంజ్ అనేది పెరుగుతుంది అని అంటూ ఉంటారు సినీ జనాలు కూడా. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే ఓటీటీ కి డిమాండ్ అనేది క్రమంగా పెరుగుతుంది అని అంటున్నారు జనాలు.  అందుకే ఇప్పుడు ఓటీటీ సంస్థలు ఒక కీలక నిర్ణయానికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ వీడియో ని  చాలా వరకు డివైజ్ లో వాడే అవకాశం ఉంది. 

 

ఇప్పుడు ఆ సంఖ్యని భారీగా తగ్గించే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. కేవలం రెండు డివైజ్ లకు మాత్రమే అనుమతి ఇచ్చే సూచనలు కనపడుతున్నాయి. అవును దానికి కారణం భవిష్యత్తులో సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఉండటంతో ఖాతాదారుల సంఖ్యను పెంచుకునే విధంగా అమెజాన్ ఆలోచిస్తుంది అని అందుకే ఈ నిర్ణయం తీసుకుంది అని సమాచారం. దాని ద్వారా భవిష్యత్తులో  మరింత ఆదాయ౦ పొందడమే కాకుండా ఆదరణ కూడా పెంచుకునే అవకాశం ఉంది అని సంస్థ భావిస్తుంది. 

 

ప్రస్తుతం దీనికి సంబంధించి సంస్థ చర్చలు జరుపుతుంది. త్వరలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని అంటున్నారు జనాలు. చూడాలి మరి ఏ విధంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు అనేది. ఇప్పుడు తమిళ హిందీ తెలుగు సినిమాలు అన్నీ కూడా ఆదరణ ఎక్కువగా ఉన్న ప్రైమ్ వీడియో మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అందుకే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది అనేది టాలీవుడ్ లో ఎక్కువగా వినపడుతున్న షాక్. అయితే ఇలా చేస్తే తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: