టాలీవుడ్ లో రాజమౌళి సినిమా విడుదల అవుతుంది అనగానే చాలా మందికి ఉండే ఆసక్తి ఒకటే. సినిమా బడ్జెట్ ఏ విధంగా ఉంటుంది. సినిమా బడ్జెట్ తో పాటుగా సినిమా విడుదల అయిన తర్వాత వచ్చే వసూళ్లు ఏ విధంగా  ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు వీటి గురించే జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పవచ్చు. ఇక ఆయన సినిమాల్లో బాహుబలి నాదు చేసిన రికార్డుల గురించి అది సాధించిన వసూళ్ళ గురించి ఎంతః చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమా సాధించిన వసూళ్లు చూసి అటు బాలీవుడ్ కూడా షేక్ అయింది అనే విషయం అందరికి తెలుసు. 

 

ఇక ఈ సినిమా తర్వాత ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. ఇక ఈ సినిమాకు భారీ బడ్జెట్ ని కేటాయించారు నిర్మాత దానయ్య. అది పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త చిత్ర యూనిట్ తో పాటు అభిమానులను కూడా కలవరపెడుతుంది అని చెప్పవచ్చు. అసలు అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... ఈ సినిమా వసూళ్లు భారీగా పడిపోయే అవకాశం ఉందని దర్శక నిర్మాతలు అంచనా వేస్తున్నారు. అవును ఈ సినిమా మార్కెట్ భారీగా పడిపోయే అవకాశం ఉందనే అంచనాతోనే వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ ని తగ్గించే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం.

 

సినిమా గతంలో మాదిరిగా కొత్త రికార్డులు ఏమీ బద్దలు కొట్టే అవకాశం లేదు అని థియేటర్ కి అభిమానులు వచ్చే పరిస్థితి దాదాపుగా లేదు అని కాబట్టి వసూళ్లు అనేవి అంతగా రావు అని కాబట్టి బయట మార్కెట్ ని ఆధారంగా చేసుకుని సినిమాకు సంబంధించిన మార్కెట్ ని పెంచుకోవాలి అని యోచిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: