గత మూడు సంవత్సరాల నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ పండగలు చేసుకుంటున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఈ యేడాది 'సరిలేరు నీకెవ్వరు' తో హ్యాట్రిక్ విజయం సాధించడంతో మహేష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. కాగా ఈ ఏడాది తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నాడు మే 31 వ తారీకు తన నెక్స్ట్ సినిమా... డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ‘సర్కారీ వారి పాట’ టైటిల్ ని ప్రకటించి డిఫరెంట్ మాస్ లుక్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే.

IHG

సరికొత్త మేక్ఓవర్ తో మహేష్ బాబు రిలీజ్ చేసిన ఈ స్టిల్ కి సోషల్ మీడియాలో అభిమానులు నెటిజన్లు బ్రహ్మరథం పట్టారు. బ్యాక్ లాంగ్ హెయిర్ తో పాటు మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూ ఉండటంతో సినిమా స్టోరీ ఏమై ఉంటుంది అనే ఆసక్తి సినిమా ప్రేక్షకులలో నెలకొని ఉంది. ఇదిలా ఉండగా మహేష్ బాబు కోసం కన్నడ తోపు హీరో మంచి క్రేజ్ కలిగిన నటుడు సుదీప్… ఈ సినిమాలో చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు అందుతున్నాయి.

IHG

గతంలో రాజమౌళి దర్శకత్వంలో 'ఈగ' సినిమాలో విలన్ గా అద్భుతమైన నటనతో సుదీప్ నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహేష్ నటిస్తున్న 'సర్కారీ వారి పాట' సినిమాలో విలన్ పాత్రలో సుదీప్ నటించనున్నాడని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫుల్ స్క్రిప్ట్ విని సుదీప్ ఓకే చేసినట్లు.. తన రోల్ కోసం ఏకంగా 30 రోజుల పాటు డేట్ లు ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాని మహేష్ ఏకధాటిగా షూటింగ్ చేసి త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: