సినీ పరిశ్రమలో ఈ మద్య డేటింగ్ కల్చర్ బాగా పెరిగిపోయింది...  ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే ఈ జాడ్యం మరింత ఎక్కువ అనే చెప్పాలి.  చాలా మంది డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు.. విడిపోయిన వారు ఉన్నారు.  తాజాగా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో గోప్యంగా ఉంచే బాలీవుడ్‌ సింగర్‌ మోనాలీ ఠాకూర్‌ ఓ రహస్యాన్ని వెల్లడించి అందరికి షాక్‌ ఇచ్చారు.  ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకు ఇప్పటికే పెళ్లయిందని తెలిపింది మోనాలీ. స్విట్జర్లాండ్‌కు చెందిన రెస్టారెంట్‌ మేనేజర్‌ మైక్‌ రిచ్‌టేను వివాహమాడినట్లు చెప్పింది.  కాకపోతే ఈ విషయాన్నిమాత్రం సోషల్‌ మీడియాతో సహా ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మూడు సంవత్సరాల క్రితమే నేను స్విట్జర్లాండ్‌కు చెందిన రెస్టారెంట్ యజమాని మైక్ రిచ్టేను వివాహం చేసుకున్నాను.

IHG

2017లోనే మాకు పెళ్లి జరిగింది. మూడేళ్లుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాం. అయితే కొన్ని సార్లు నా ఇన్‌స్టాగ్రామ్‌ ఫోటోల్లో ఉంగరం కనిపించేది. దాంతో జనాలు పెళ్లి చేసుకున్నావా అని ప్రశ్నించేవారు  అని తెలిపారు. మైక్‌, నేను మా పెళ్లి విషయాన్ని మూడేళ్లు  విజయవంతంగా ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాం. అంతే కాదు ఈ విషయం ఇండస్ట్రీలో కొద్ది మందికి మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది.  

IHG

నా పెళ్లి వార్త చాలా మంది స్నేహితులు, ఇండస్ట్రీ వారికి షాకింగ్‌గా అనిపించవచ్చు. ఎందుకంటే నా స్నేహితులను కూడా ఆహ్వానించలేదు. వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ను, పెళ్లి ప్రకటనను మూడేళ్లుగా ఎవరికి తెలియకుండా ఉంచామంటూ చెప్పుకొచ్చింది మోనాలీ ఠాకూర్‌.  ఈ అమ్మడు జానే మన్‌, గోల్‌మాల్‌ రిటర్న్స్‌, రేస్‌, న్యూయార్క్‌ సినిమాలతో పాటు మరెన్నో హిందీ సినిమాలు, బెంగాలీ సినిమాల్లో పాటలు పాడి అందరినీ అలరించింది మోనాలీ ఠాకూర్‌.   ఇప్పటికైనా నీ పెళ్లి విషయం బయట పెట్టావు.. అంటున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: