దేశంలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి సినీ పరిశ్రమ పూర్తిగా షట్ డౌన్ అయిన విషయం తెలిసిందే.   ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో సినీ కార్మికులు కష్టాలు పడుతున్న నేపథ్యంలో ఎంతో మంది సినీ పెద్దలు ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చారు.  మొదట మెగాస్టార్  చిరంజీవి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు.  అంతే కాదు ఉపాధిలేక కష్టాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో సినీ వర్కర్లను ఆదుకునేందుకు చిత్రసీమ పెద్దలు మనకోసం పేరిట కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఏర్పాటు చేశారు.  అప్పటి నుంచి సినీ కార్మికుల  కోసం ఎంతో మంది తమ దాతృత్వాన్ని ప్రదర్శించారు.  అమితాబచ్చన్ కూడా సీ.సీ.సీ.కి విరాళం అందించారు.  టాలీవుడ్ సినీ కార్మికులకు ఆర్థికసాయం, నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు.

 

దీనిపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, ఈ నెల కూడా సినీ కార్మికులకు పెద్ద ఎత్తున బియ్యం, నిత్యావసరాలు, కూరగాయలు అందిస్తున్నామని, ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. కళామతల్లిని నమ్ముకొని ఎంతో మంది ఉన్నారని.. వాళ్లకు ఏ మాత్రం కష్టం కలగకుండా తమ వంతు సహాయం అందించాడానికి ముందుకు వచ్చామని చిరంజీవి అన్నారు. 

 

నాణ్యతలో రాజీపడకుండా, ఎంతోమంది వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని వారిందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రతి విషయం దగ్గ ఉండి చూసుకోవడమే కాదు.. అందరికీ అతి త్వరగా అందేలా కృషి చేస్తున్నామని చిరంజీవి అన్నారు.  సినీ పరిశ్రమలో దినసరి వేతనాలపై పనిచేస్తున్న వర్కర్లకు వారి ఇంటి వద్దకే సాయం అందజేస్తున్నామని, ఎంతో పరిశుభ్రమైన వాతావరణంలో ప్యాక్ చేసిన సరుకులనే ఇస్తున్నామని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: