జయం సినిమా తో విలన్ గా పరిచయం అయిన గోపీచంద్ ఆ తర్వాత క్రమక్రమంగా హీరోగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న వస్తున్నసంగతి టాలీవుడ్ ప్రేక్షకులకు అందరికీ తెలిసిందే. ఇకపోతే గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాస చిట్టూరి ద్వారా నిర్మిస్తున్న చిత్రం సిటీ మార్. ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగనుంది. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

IHG


ఈ సంవత్సరం మొదట్లో మొదలైన ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ ముగిసేసరికి షెడ్యూల్ లో 60 శాతం వరకు షూటింగ్ ని పూర్తి చేసుకుంది. మిగిలిన భాగాన్ని ఆగస్టు మొదటి వారం నుండి షూటింగ్ మొదలు పెట్టి ఒకే షెడ్యూల్లో సినిమాని పూర్తి చేయడానికి చిత్ర యూనిట్ రంగం సిద్ధం చేస్తోంది. ఇకపోతే గోపీచంద్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తమ అభిమాన నటుడి సినిమా కోసం వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఆ సినిమా నిర్మాత చెప్పుకొచ్చారు. రేపటి రోజున అనగా జూన్ 12న గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా సిటీ మార్ టీం శుభాకాంక్షలు తెలిపి కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. 

IHG's Seetimaar First Look Out !!


ఇక ఈ సినిమా విషయాలకు వస్తే ఆంధ్ర కబడ్డీ జట్టుకు కోచ్ గోపీచంద్ నటించనుండగా... తెలంగాణ కబడ్డీ జట్టుకు హీరోయిన్ తమన్నా కోచ్ గా ఇందులో కనిపించబోతున్నారు. అంతే కాదు ఇందులో మరో హీరోయిన్ కూడా నటించనుంది. అలాగే ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఒక పాట మినహాయించి మిగితా పాటలు అన్నిటికీ రికార్డ్ చేయడం పూర్తి అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: