సౌత్ స్టార్ హీరో సూర్య యాక్టింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గజినితో సూర్య తమిళ్ తోపాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇందులో సూర్య యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆచిత్రం భారీ విజయం సాధించడంతో అక్కడి నుండి సూర్య వెనుదిరిగి చూసుకోలేదు.ఇక తాజాగా మరోసారి సూర్య తన నట విశ్వరూపాన్నిచూపించాడట.
 
సుధా కొంగర డైరెక్షన్ లో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సురరై పోట్రు. కొద్దీ రోజుల క్రితం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈసినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ ఇచ్చింది అంతేకాదు సూర్య నటనకు బోర్డు సభ్యులు ఫిదా అయ్యారట. సినిమా బాగుంది, సూర్య నటన సినిమాలో హైలెట్ అవుతుందని సెన్సార్ సభ్యులు సినిమా యూనిట్ ను అభినందించారని కోలీవుడ్ మీడియా వెల్లడించింది. 
 
అయితే నిజ జీవిత కథతో తెరకెక్కిన ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా ఎంత వరకు సక్సెస్ అవుతుందో అనే అనుమానులు కూడా వున్నాయి. ఇక గత కొంత కాలంగా వరస పరాజయాలను చవిచూస్తున్న సూర్య ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తెలుగులో ఈచిత్రం ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో విడుదలకానుంది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు  జిఆర్ గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం లో అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. వెటరన్ తెలుగు యాక్టర్  మోహన్ బాబు ఈచిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. థియేటర్లు తెరుచుకోగానే ఈసినిమా విడుదలచేయాలని మేకర్స్ భావిస్తున్నారు. సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్స్,సిక్య ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇక సూర్య ప్రస్తుతం హరి డైరెక్షన్ లో అరువలో నటించడానికి రెడీ అవుతున్నాడు. ఈచిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: