బాలయ్య బోయపాటి అంటేనే పక్కా మాస్. థియేటర్లలో  ఫ్యాన్స్ కి పూనకాలే. అదేంటో ఏ హీరో అయినా ఇపుడున్న టైమ్ లో  మాస్ మూవీ  చేస్తే  ఆడియన్స్  ఆ బాక్సుల్ని తిప్పికొడుతున్నారు. కానీ బాలయ్య బోయపాటి సినిమా అంటే మాత్రం ఆ క్రేజ్ అలాగే ఉంది. అందుకే కేవలం చిన్న టీజర్ మొత్తం జాతకం మార్చేసింది.

IHG

బాలయ్య ఈజ్ బ్యాక్ అనేలా చేసింది. లేకపోతే బాలయ్య ఇంత సంతోషంగా వీడియో మేసేజ్ పెట్టి మరీ అందరికీ థాంక్స్ చెప్పరుగా. ఇక కేవలం 36 గంటల్లోనే ఈ టీజర్ కి ఆరు మిలియన్ల  వ్యూస్  వచ్చాయంటే బొమ్మ అదిరిపోవడంలేదూ అంటున్నారు. ఈ టీజర్ బాలయ్యలోని పవరూ పొగరూ రెండూ ఎలివేట్ చేసింది. డైలాగుల్లో బాలయ్యకు ఆయనే సాటి అనిపించింది. నిజానికి ఇపుడు కరోనా లాక్ డౌన్ ఉంది. మరో వైపు చూస్తే బాలయ్య గత ఏడాదిగా మార్కెట్ సరైనది లేక దిగాలుగా ఉన్నాడు. ఇంకో వైపు బోయపాటి వినయవిధెయ రామతో భారీ డిజాస్టర్ తో బాగా  డల్ గా ఉన్నాడు.

 

IHG

అయితే ఈ ఇద్దరి కాంబో మాత్రం ఎపుడూ అదుర్స్. సింహా, లెజెండ్ ఒకదాన్ని ఒకటి మించిపోయాయి. ఇపుడు వస్తున్నది ముచ్చటగా మూడు దాంతో ఈ మూవీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున ఫ్యాన్స్ కు నిజంగా నందమూరి గర్జన వినిపించాడు బోయపాటి ఇది చాలు సినిమా అంతా మాస్ తో మంచి విందు భోజనం ఉంటుందని చెప్పడానికి అంటున్నారు ఫ్యాన్స్. బాలయ్య సైతం చాలా తొందరగా ఈ మూవీని చేస్తానని చెబుతున్నాడు. ఈ మూవీ విషయంలో ఇన్నాళ్ళూ ఉన్న డౌట్స్  కూడా తొలగిపోయి నిర్మాత రవీంద్రరెడ్డి సైతం హ్యాపీట. ఇక బడ్జెట్ కూడా పెరగవచ్చునని, లావిష్ గా మూవీని తీసి జనం మీద వదిలితే బాలయ్యతో సంక్రాంతే అంటున్నారు ఫ్యాన్స్ మరి బాలయ్య మజాకానా.

మరింత సమాచారం తెలుసుకోండి: