మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు రాం చరణ్. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన చిరుత తో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ గా ఎదిగాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా రికార్డ్స్ ని సృష్ఠించింది. చరణ్ కెరీర్ లో రెండవ సినిమా గా వచ్చిన మగధీర అప్పటి వరకు సాధించిన చాలా సినిమాల రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. దాంతో మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను రాం చరణ్ కి ఊహించని క్రేజ్ వచ్చేసింది.

 

అప్పటి నుంచి రాం చరణ్ టాలీవుడ్ లో అంచలంచెలుగా ఎదిగాడు. అంతేకాదు సినిమా సినిమాకి చరణ్ తో నిర్మిస్తున్న సినిమాల బడ్జెట్ తో పాటు చరణ్ మార్కెట్ కూడా పెరుగుతూనే ఉంది. హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు ఈ మెగా పవర్ స్టార్. అంతేకాదు తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమాతో నిర్మాతగాను మారాడు. ఇంత చిన్న వయసులో నిర్మాతగా మారడం ఖైదీ నంబర్ 150, సైరా వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించడం పెద్ద సంచలనం అయింది.

 

సినిమాలను నిర్మించడం లో కథ లని ఎంచుకోవడం లో ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాని తెలుగులో రీమేక్ చేసేందుకు భారీ మొత్తం తో ఆ సినిమా రైట్స్ దక్కించుకోవడం లో చరణ్ .. అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి పెద్ద నిర్మాతలతో పోటీ పడటం గొప్ప విషయంగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తండ్రికి విపరీతంగా నచ్చిన మళయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ రీ మేక్ రైట్స్ ని కొన్నాడు. ఈ సినిమా బాధ్యతలు సాహో డైరెక్టర్ కి అప్పగించాడు. అయితే ఏమాత్రం అనుభవం లేని రాం చరణ్ నిర్మాతగాను గ్రేట్ అనిపించుకుంటున్నాడు. 

 

దాంతో చిరంజీవి.. కొడుకు రాం చరణ్ ని చూసి ఎంతో గర్వపడుతున్నారు. అంతేకాదు మగధీర లాంటి సినిమా కెరీర్ ప్రారంభంలోనే చేసి రికార్డ్స్ తిరగరాయడం, ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడం ..మరో వైపు ఆచార్య సినిమా కి సంబంధించిన వ్యవహారాలని చూసుకోవడం లాంటి విషయాలు ఇప్పుడు చిరంజీవికి పట్టలేని ఆనందాన్నిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: