టాలీవుడ్ కింగ్ ..నాగార్జున కెరీర్ లో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది సోగ్గాడే చిన్ని నాయనా. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగార్జున డ్యూయల్ రోల్ లో ప్రేక్షకులను అలరించాడు. రెండు విభిన్నమైన పాత్రల్లో నటించిన నాగార్జున మనం తర్వాత మళ్ళీ సోలో హీరోగా తన ఖాతాలో హిట్ గా నిలిచింది.

 

దాంతో అప్పటి నుంచి ఈ సినిమాకి ప్రీక్వెల్‌ను రూపొందించాలని నాగార్జున ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. అందులో భాగంగానే అదే దర్శకుడికి సోగ్గాడే చిన్ని నాయనా కి ప్రీక్వెల్ గా స్క్రిప్ట్ ని సిద్దం చేయమని చెప్పగా కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ రెడీ చేశాడు. కాని ఈ ప్రాజెక్ట్ మాత్రం ఎందుకనో పట్టాలెక్కలేదు.

 

అయితే నాగార్జున మన్మధుడు 2 భారీ ఫ్లాప్ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ లైన్ లోకి వస్తుందని ఈ సారి ఖచ్చితంగా సెట్స్ మీదకి రాబోతుందని అనుకున్న సమయంలో లాక్ డౌన్ వచ్చి పడింది. దాంతో ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న వైల్డ్ డాగ్ కూడా కొంతభాగం టాకీ పార్ట్ జరుపుకొని ఆగిపోయింది. రెండు నెలల తర్వాత మళ్ళీ అన్ని సినిమాలు షూటింగ్స్ కి రెడీ అవుతుండటంతో వైల్డ్ డాగ్ తో పాటు నాగార్జున కళ్యాణ్ కృష్ణ ల బంగార్రాజు సెట్స్ మీదకి వస్తుందనుకున్నారు. కాని తాజా సమాచారం ప్రకారం మరోసారి బంగార్రాజు వాయిదా పడనుందని అంటున్నారు.

 

ప్రస్తుతం నాగ చైతన్య తో లవ్ స్టోరీ అన్న సినిమాని తెరకెక్కిస్తున్న క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల నాగార్జున కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలవబోతుందని తెలుస్తుంది. లవ్ స్టోరీ సినిమాని తెరకెక్కిస్తున్న నిర్మాతలే ఈ సినిమాని నిర్మిస్తారని సమాచారం. ఇప్పటి వరకు కొత్త వాళ్ళతో..వరుణ్ తేజ్, నాగ చైతన్య లాంటి యంగ్ హీరోలతో సినిమాలని తెరకెక్కించిన శేఖర్ కమ్ముల మొదటి సారి సీనియర్ స్టార్ హీరో నాగార్జున తో సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ కాంబినేషన్ మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా ఆగస్టు నుండి సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: