తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో  పైకొచ్చిన హీరోలలో చాలా మంది ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఇలా  తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ... ఓవైపు యాక్షన్ సన్నివేశాలతో మరోవైపు కామెడీ టైమింగ్ తో అలరిస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు. తమదైన  కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తూ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న హీరోలలో ఒకరు రవితేజ. మొదటి నుంచి రవితేజ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన విషయం తెలిసిందే. రవితేజ దాదాపుగా అన్ని కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాల్లోనే నటిస్తూ ఉంటారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు రవితేజ. 

 

 

 అదే సమయంలో యాక్షన్ సన్నివేశాలతో అదరగొడుతూ  మాస్ ప్రేక్షకులందరికీ మాస్ మహారాజా కూడా మారిపోయాడు. మాస్ మహారాజా రవితేజ కామెడీ టైమింగ్ కి సినీ ప్రేక్షకులు అందరూ ఫిదా అవ్వాల్సిందే అని చెప్పాలి   తనదైన కామెడీ టైమింగ్ తో.. అదిరిపోయే ఆటిట్యూడ్తో.. ప్రతి సన్నివేశంలో  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటాడు రవితేజ. ముఖ్యంగా రవితేజ కెరియర్ లో విక్రమార్కుడు  సినిమా రవితేజ లోని పూర్తిస్థాయి కమెడీయన్ న్ని సినీ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఓ వైపు పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన యాక్షన్ సన్నివేశాలతో అదరగొడుతూనే... మరోవైపు దొంగగా కూడా తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతూ  తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు రవితేజ. ఇక ప్రతి  సినిమా లో తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. 

 


 ముఖ్యంగా రవితేజ హీరోగా నటించే అన్ని  సినిమాలు  కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఉంటాయి. తనదైన  కామెడీతో అలరిస్తూ  ఎంతో మంది ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తూ ఉంటాడు హీరో రవితేజ. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రవితేజ సినీ ప్రస్థానం ప్రారంభించినప్పటినుంచి ఇప్పటివరకు... సినిమా కథ ఎలా ఉన్నప్పటికీ ప్రతి సినిమాలో తనదైన ఆటిట్యూడ్తో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు అని చెప్పాలి. అయితే ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో రవితేజ కామెడీ టైమింగ్ తో అదరగొడుతూ  వుంటాడు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంది కమెడియన్స్ ఉన్నప్పటికీ... ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ రవితేజకు మాత్రం ఒక ప్రత్యేకమైన క్రేజ్  ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: