తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఎంతో మంది స్టార్ హీరోలు గా కొనసాగుతున్నారు . అయితే స్టార్ హీరోలు అన్న  తర్వాత ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్... అదిరిపోయే నటన ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది హీరోల సినిమాలలో ఏకంగా  ఫుల్ టైం ఎంటర్టైన్ మెంట్  కూడా ఉంటుంది. అది కూడా ఏదో కమెడియన్స్ ద్వారా వచ్చిన కామెడీ కామెడీ కాదు . ఏకంగా స్టార్ హీరోలే  అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అదరగొడుతోన్నారు . కమెడియన్స్ తో కలిసి సినిమాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉన్నారు . తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో  యాక్షన్ ఇరగదీయటం తో పాటు  అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. 

 


 మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ ఎలిమెంట్స్ లో ఇరగ తీయడంతో పాటు మరోవైపు డాన్సులతో ఎంతో మందిని ఆకర్షించారు... తనదైన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ చూస్తూ ఉంటే... అబ్బా ఏం టైమింగ్ రా బాబు అనిపిస్తూ ఉంటుంది సినీ ప్రేక్షకులకి. ఇక మొదటి నుంచీ తన సినిమాలో అద్భుతమైన కామెడీతో కూడా అలరిస్తూనే వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఓవైపు యాక్షన్... మరోవైపు నటన... ఇంకోవైపు డాన్సులు... ఇక చివరిగా కామెడీ.. ఇన్ని ఉండటం వల్లే నేమో  చిరంజీవి  మెగాస్టార్ చిరంజీవి గా మారిపోయాడు. 

 


 ప్రతి సినిమాలో అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అదిరిపోయే డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులందరికీ కామెడీ పంచుతూ కడుపుబ్బా నవ్విస్తూ ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇక మెగాస్టార్ చిరంజీవి ఏకంగా కామెడీకి దేవుడు అయినా చార్లీ చాప్లిన్ లాంటి పాత్రలో కూడా నటించి  ఎంతో మంది ప్రేక్షకులకు కామెడీని పంచిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ఖైదీ నెంబర్ 150 లో కూడా... కమెడియన్ అలీ తో కలిసి చిరంజీవి చేసిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది అని చెప్పాలీ. చిరంజీవి లో ఒక గొప్ప హీరోతో పాటు అంతకంటే గొప్ప కమిషన్ కూడా ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: