తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న విషయం తెలిసిందే. అయితే చాలామంది స్టార్ హీరోలు యాక్షన్ సన్నివేశాలతో అదిరిపోయే యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తూనే  ఉంటారు. కొంతమంది హీరోలు అయితే ఏకంగా కామెడీని కూడా కమెడియన్స్ కంటే అద్భుతంగా పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటారు. ఇలా చాలా మంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉన్నప్పటికీ కమెడియన్స్ కంటే ఎక్కువగా కామెడీ టైమింగ్ తో అదరగొడుతున్నారు. ఇలా కామెడీ తో అద్భుతంగా అలరిస్తున్న హీరోలలో ఒకరు వెంకటేష్. మొదటి నుంచి వెంకటేష్ డిఫరెంట్ జోనర్ సినిమాలు చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో వెంకటేష్ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. 

 


 అయితే హీరో వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా వెంకటేష్ కామెడీ ముందు స్టార్ కమెడియన్స్ సైతం  పని చేయరేమో అనేంతలా  తన కామెడీతో ప్రేక్షకులను ప్రభావితం చేస్తూ ఉంటాడు హీరో వెంకటేష్. తనదైన హావా భావాలతో అద్భుతమైన కామెడీ పంచుతూ ఉంటాడు. ఇప్పటి వరకు వెంకటేష్ చేసిన చాలా సినిమాల్లో  ఇలా అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అలరించాడు అని చెప్పింది. మొదటి నుంచి వెంకటేష్ సినిమాలు  ఫ్యామిలీ ఆడియన్స్ ను ఉద్దేశించినవీ గానే ఉన్నాయి. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ వెంకటేష్ కి మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. 

 


 అయితే వెంకటేష్ ఏదైనా సినిమాలో  కామెడీ చేసాడు అంటే తన హావభావాలతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. రీసెంట్ గా వెంకటేష్ లోని  కామెడీ యాంగిల్ పూర్తిస్థాయిలో చూపించిన సినిమా ఎఫ్ 2. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వరుణ్ తేజ్ వెంకటేష్ హీరోలుగా వచ్చిన చిత్రం ఎఫ్ 2.ఈ సినిమాలో ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు పంచుతాడు వెంకటేష్. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. ఇలా వెంకటేష్ తన హావభావాలతో ఏకంగా కమెడియన్స్ ని సైతం మరిపించేలా కామెడీ చేస్తాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: