కరోనా వచ్చి మొత్తం మానవ జీవితం మార్చేసింది. ప్రపంచం మొత్తం స్థంభించింది. ఒకటేంటి అన్ని రంగాలూ దిగాలు పడ్డాయి. కొన్ని మూలన పడ్డాయి.ఇక కరోనా వల్ల కొత్త రకంగా అంతా బతకాలి. కొత్తగానే ఉండాలి ఇదే ఇపుడు జీవిత సూత్రం

IHG

మరి జీవితాలను చూసి సినిమాలు తీసే వారికి కూడా ఇదే సూత్రం  వర్తిస్తుంది. ఇక ఖర్చు విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. సినిమాలు కూడా భారీ బడ్జెట్లో  తీస్తే మునిగిపోతామని అపుడే నిర్మాతలు కలవరపడుతున్నారు. ఎందుకంటే ధియేటర్లు ఇప్పట్లో తెరవరు. తెరచినా జనం వస్తారన్న నమ్మకాలు లేవు. 

IHG

మళ్ళీ కధ మొదటి నుంచి మొదలుపెట్టాలి. అందువల్ల్ల సినిమా విషయంలో అన్ని విభాగాల ఖర్చులు పద్దులు రాసుకుని మరీ సగానికి సగం కట్ చేస్తున్నారు. ఈ టైంలో సినిమాల్లో హీరోలకే కాదు. బాలీవుడ్ భామలకు కాస్టీ హీరోయిన్లకు కూడా ఇబ్బందిగా ఉందిట.

IHG

ఇక ఇటు ఫ్లైట్ పెట్టి అటు ఫ్లీట్ పెట్టి మంచి హొటల్లో ఉంచి షూటింగులు చేసే ఖరీదయిన అందాల భామలు ఇపుడు టాలీవుడ్ మోయలేదని అంటున్నారు. తక్కువలో సినిమా పూర్తి కావాలి. దాంతో లోకల్ టాలెంట్ కి ఇకమీదట ప్రోత్సహిస్తారని అంటున్నారు.

IHG

దీంతో ఇపుడు సినిమాల్లో ఇదివరకు పాత సినిమాల్లో  మాదిరిగానే తెలుగు అందానికి అవకాశం ఉంటుందని అంతా ఆశ పడుతున్నారు. తెలుగు వారు అయితే చాలామరకు ఖర్చులు తగ్గుతాయని కూడా ఫిల్మ్ మేకర్స్  లెక్కలు వేస్తున్నారుట. మొత్తానికి కరోనా వచ్చి మన తెలుగు ముద్దుగుమ్మలకు అవకాశాలు పెంచాయని అంటున్నారు. చూడాలి మరి ఎంతవరకూ ఆఫర్లు వస్తాయో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: