కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం మెడికల్ కాలేజ్ కరోనా ఐసోలేషన్ వార్డులో జరిగిన ఘటన ఇప్పుడు రాష్ట్రాం మొత్తాన్ని విస్మయానికి గురి చేసింది. 33 ఏళ్ల వయసు గల ఒక వ్యక్తి మే 28 తేదీన తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ ఉండగా ఒకసారి కళ్ళు తిరిగి పడిపోయాడు. అతనిని వెంటనే హాస్పిటల్ కు తీసుకొని రాగా అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. మద్యం కొనేందుకు తమిళనాడుకి వెళ్లి రావడం వల్ల అతనికి కరోనా వచ్చి ఉంటుందని వైద్యులు భావించారు.

 

ఇక వెంటనే అతనికి సంబంధించిన కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల ను ఒక నలభై మందిని క్వారంటైన్ లో ఉంచగా మధ్యలో అతనికి చికిత్స జరుగుతున్న సమయంలో రెండు సార్లు ఆసుపత్రి నుండి పారిపోయేందుకు యత్నించగా మళ్లీ ఆసుపత్రి వారు అతనిని అతికష్టం మీద వెతికి పట్టుకుని వచ్చారు. తర్వాత అతనికి కొద్ది రోజులు చికిత్స చేసిన తర్వాత జూన్ 7 తేదీన రెండోసారి అతనికి కరోనా టెస్టు జరపగా ఈసారి నెగిటివ్ వచ్చింది. మరలా ఇంకొక కరోనా నిర్థారణ పరీక్ష చేసి డిశ్చార్జి చేద్దామని నిర్ణయించుకున్నారు వైద్యులు.

 

ఎలాగో అతను డిశ్చార్జి అయిపోయే వ్యక్తి కాబట్టి కొంచెం ఆదమరిచి హాస్పిటల్ సిబ్బంది ప్రవర్తించారో ఏమో కానీ జూన్ 9 తేదీన సరిగ్గా అతనికి పరీక్ష చేసేందుకు శాంపిల్స్ తీసుకుందామని వెళ్లగా వార్డులో ఉరేసుకుని కనిపించాడు. ఇన్ని రోజులు మద్యం దొరకక అతను చాలా వింతగా ప్రవర్తించాడని బహుశా అతని ఆత్మహత్యకు కారణం ఇదే అయి ఉంటుందని ఆస్పత్రి వారు భావిస్తున్నారు. ఎప్పుడూ మద్యం సేవించే వ్యక్తికి మద్యం దొరకకపోవడమే దీనికి కారణం అని వారి వాదన. ఏదేమైనా దీనిపై మానవ హక్కుల సంఘం హాస్పిటల్ వారిని మరియు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ని రిపోర్టు అడగగా దానిని వారు మరో మూడు వారాల్లో ఇవ్వవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: