టాప్ హీరోల పేర్లు వారు నటించిన సినిమాలకు టైటిల్స్ గా పెడితే కలిసిరాదు అన్న ఒక నెగిటివ్ సెంటిమెంట్ ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. ఈ నెగిటివ్ సెంటిమెంట్ ను సపోర్ట్ చేస్తూ కొన్ని ఉదాహరణలు కూడ ప్రచారంలోకి వస్తున్నాయి. నాగార్జున హీరోగా వచ్చిన ‘కెప్టెన్ నాగార్జున’ చిరంజీవి హీరోగా వచ్చిన ‘జై చిరంజీవ’ అఖిల్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘అఖిల్’ రామ్ చరణ్ పేరులోని ‘రామ’ పదాన్ని తీసుకుని గత సంవత్సరం వచ్చిన ‘వినయ విధేయ రామ’ ఫ్లాప్ అయిన విషయాలు అందరికి తెలిసినవే.


అదేవిధంగా జూనియర్ నటించిన ‘అల్లరిరాముడు’ ‘రామయ్యా వస్తావయ్యా’ కూడ భయంకరమైన ఫ్లాప్ లు. మంచు విష్ణు ‘విష్ణు’ టైటిల్ తో చేసిన ఫస్ట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా మారిన విషయం తెలిసిందే. ఇక వెంకటేష్ ను కూడ ఈ సెంటిమెంట్ వదలలేదు గతంలో అతడు నటించిన ‘నమో వెంకటేశా’ క్రితం సంవత్సరం వచ్చిన ‘వెంకీ మామ’ సినిమాలు కూడా ఒక మోస్తరి విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. అదేవిధంగా బాలకృష్ణ పేరును కలుపుకుంటూ గతంలో వచ్చిన ‘బాల గోపాలుడు’ మూవీ కూడ ఫ్లాప్.


అయితే ఈ సెంటిమెంట్ అల్లు అర్జున్ పై ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది. చాల కాలంక్రితం స్టైలిష్ స్టార్ తన ముద్దు పేరు ‘బన్ని’ టైటిల్ తో నటించిన మూవీ మాత్రం సూపర్ హిట్. ఇప్పుడు షూటింగ్ లు లేక ఇండస్ట్రీలో జనం ఖాళీగా కాలాన్ని గడుపుతూ ఉండటంతో ఇప్పుడు టాప్ హీరోల పేర్లు సినిమా టైటిల్స్ కు కలిసిరావు అంటూ ఒక చర్చ మొదలైంది.


ఇప్పుడు ఈ చర్చ ‘ఆర్ ఆర్ ఆర్’ సృష్టి కర్త వరకు వెళ్ళడంతో జక్కన్న కూడ కొద్దిగా కలవర పడుతున్నట్లు టాక్. దీనికి కారణం ‘ఆర్ ఆర్ ఆర్’ లో ‘రౌద్రం రణం రుధిరం’ ఉన్నాయి అని రాజమౌళి చెపుతున్నా ‘ఆర్ ఆర్ ఆర్’ పేరు వినగానే ఈ మూడు ఆర్ లలో రామ్ చరణ్ రామారావు(జూనియర్) రాజమౌళి లు ఎవరికైనా వెంటనే గుర్తుకు రావడం అన్న మాటలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: