పవన్ కళ్యాణ్ కెరీర్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో జల్సా ఒకటి. ఈ సినిమా ఆయనకు చాలా రోజుల తర్వాత మంచి హిట్ ఇచ్చింది. స్టార్ హీరో గా ఉన్నా సరే ఒక మంచి సినిమా కోసం ఆయన ఎదురు చూసి ఈ సినిమాతో హిట్ కొట్టారు అనే చెప్పాలి. ఈ సినిమా ఆయనకు అన్ని విధాలుగా ప్లస్ అయింది అనేది వాస్తవం. ప్రతీ సీన్ లో కూడా ఆయన నటన తో పాటుగా ఆయన మాటలు ఆయన డైలాగ్ లు ఈ సినిమాలో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ఆయనకు మంచి గుర్తింపు కూడా అన్ని వర్గాల నుంచి వచ్చింది అనే చెప్పాలి. ఇక అది అలా ఉంటే... 

 

ఈ సినిమాలో పవన్ చేసిన కామెడి కి కూడా మంచి మార్కులు పడ్డాయి అని చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా ఆయన కామెడి తో అలరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మానందం తో కలిసి ఆయన చేసిన కామెడి చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వారు అనేది వాస్తవం. ఈ సినిమా తర్వాత పవన్  మళ్ళీ కెరీర్ లో ఒక మంచి హిట్ కోసం ఎదురు చూసిన సందర్భం కూడా ఉంది. అయితే ఆయనకు ఆ తర్వాత మంచి హిట్ అనేది రాలేదు అనే చెప్పాలి. చాలా వరకు ఆయన చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. 

 

ఆ తర్వాత ఆయన చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లో వచ్చారు.  ఇక అక్కడి నుంచి ఆయన ప్రతీ సినిమా మళ్ళీ ఫ్లాప్ అయింది. ఇప్పుడు చేస్తున్న వకీల్ సాబ్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అవ్వాలి అని పవన్ ఫాన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: