టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టార్ ఇమేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. చాలా తక్కువ కాలంలో ఆయన స్టార్ ఇమేజ్ ని తెచ్చుకున్నారు అనే చెప్పాలి. అగ్ర హీరో తమ్ముడు అయినా సరే ఆయన మాత్రం చాలా బాగా ప్రేక్షకులను తన వైపుకి తిప్పుకుని... ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. సొంతగా పైకి వచ్చే ప్రయత్నం చేసాడు ఆయన అనేది వాస్తవం. ఇక ఆయన సినిమాల్లో ఉండే కామెడి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆయన హీరోగా వచ్చిన సినిమాల్లో  అత్తారింటికి దారేది సినిమాలో కామెడి చాలా బాగా ఆకట్టుకుంది. 

 

ఆ సినిమాలో బ్రహ్మానందం తో కలిసి ఆయన చేసిన  కామెడి చాలా బాగా నచ్చింది జనాలకు అనేది వాస్తవం. ప్రతీ సీన్ లో కూడా చాలా బాగా మెప్పించారు ఆయన కామెడి తో అని విమర్శకులు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఎమ్మెస్ నారాయణ  తో కలిసి కూడా ఆయన చాలా బాగా కామెడి చేసారు అనే చెప్పాలి. ఏ సీన్ లో అయినా సరే ఆయన కామెడి గురించి చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హిట్ ఇప్పటి వరకు కొట్టలేదు. ఆయన కెరీర్ లో  ఒక్క హిట్ ఇప్పుడు వచ్చినా చాలు అనుకునే పరిస్థితి ఉంది.

 

చిన్న చిన్న సీన్స్ లో కూడా ఆయన కామెడి కి మంచి ఆదరణ అనేది ఉంటుంది. ప్రతీ సీన్ కి కూడా అందం వచ్చే విధంగా కామెడి చేస్తూ ఉంటారు. కాగా పవన్ ఇప్పుడు వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆయన లాయర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: