సినిమాల్లో హాస్యం అనేది ఎప్పటి నుంచో ఉంది. సాంఘిక చిత్రాలు ప్రారంభమైన దగ్గర నుంచే కామెడీకి పెద్ద పీట వేశారు మన దర్శక నిర్మాతలు. ముఖ్యంగా సినిమా కమర్షియల్ ఫార్మాట్‌లోకి వచ్చిన తరువాత ప్రతీ సినిమాలో తప్పకుండా ఓ కామెడీ ట్రాక్‌ ఉండేలా చూసుకునే వారు. హీరోతో పాటు కామెడీయన్‌కు కూడా పాటలు, జోడి ఉండేలా ప్లాన్ చేసేవారు.

 

అయితే కామెడీ కోసం మరో ఆర్టిస్ట్‌ కాకుండా హీరోనే కామెడీ చేసే స్టైల్‌ కూడా మన తెర మీద సూపర్ హిట్ అయ్యింది. అలాంటి చిత్రాలను 80లలోనే మొదలు పెట్టిన దర్శకుడు వంశీ. అప్పటి వరకు ఉన్న కామెడీ స్టైల్‌ను పక్కన పెట్టి కాస్త స్టైస్‌ జోడించిన కామెడీతో ఆకట్టుకున్నాడు. ద్వంద్వార్థాలు, రొమాంటిక్‌ కామెడీలతో  తెలుగు సినిమాకు కొత్త టేస్ట్ చూపించాడు.

 

కెరీర్‌ స్టార్టింగ్‌లో సస్పెన్స్‌ థ్రిల్లర్‌లను తెరకెక్కించిన వంశీ తరువాత పూర్తిగా రూట్‌ మార్చాడు. లేడీస్‌ టైలర్‌ సినిమాతో కామెడీ టర్న్‌ తీసుకున్నాడు. నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్‌కు కామెడీ హీరోగా తిరిగిలేని స్టార్ ఇమేజ్‌ తీసుకువచ్చిన ఈ సినిమా కూడా ఇదేకావటం విశేషం. ఆ తరువాత కూడ అదే తరహ సినిమాలు చేశాడు వంశీ.

 

మహర్షి లాంటి డిఫరెంట్ సినిమాలు చేస్తూనే శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్‌ డ్యాన్స్ ట్రూప్‌ ఏప్రిల్ ఒకటి విడుదల, డిటెక్టివ్‌ నారధ, జోకర్ లాంటి సూపర్‌ హిట్ కామెడీ ఎంటర్‌టైనర్‌లను రూపొందించాడు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు చూపించాడు ఈ సీనియర్ దర్శకుడు అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు లాంటి డీసెంట్‌ లవ్‌ స్టోరిలో కూడా తనదైన స్టైల్‌ కామెడీని జొప్పించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ  జనరేషన్‌కు వంశీ కామెడీ పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోవటంతో సక్సెస్‌ రేట్‌ పూర్తిగా పడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: