కరోనా మూలంగా థియేటర్లు ఇప్పుడే ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నిర్మాతలందరూ థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగులకి అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం మరికొద్ది రోజుల్లో థియేటర్లకి కూడా పర్మిషన్ ఇవ్వనుందని అనుకుంటున్నారు. అయితే ఆ విషయమై ఎలాంటి స్పష్టత లేదు కాబట్టి చాలా మంది నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీ ద్వారా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

 


ఈ నేపథ్యంలో తెలుగులో అమృతరామమ్, తమిళంలో పొన్మగళ్ వంధాల్ చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. అదే బాటలో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ ఓటీటీకి సిద్ధమైంది.  ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. అలాగే అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన గులాబో సితాబో స్ట్రీమింగ్ కి రెడీగా ఉంది.  అయితే తాజాగా మరో రెండు సినిమాలు కూడా ఓటీటీ బాట పట్టనున్నాయి. 

IHG

సూఫియుమ్ సుజాతయుమ్ అనే మళయాల చిత్రం డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ కానుంది. అదితీ రావ్ హైదరీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జయసూర్య హీరోగా కనిపిస్తున్నాడు. నరనిపుజ శానవాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఫ్రైడే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ బాబు నిర్మించాడు. తాజా సమాచారం ప్రకారం జులై 2వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవనుంది.

IHG

ఇదిలా ఉంటే మరో బాలీవుడ్ చిత్రమైన శకుంతలా దేవి ఓటీటీలోకి రానుంది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం జులై 31వ తేదీ నుండి అమెజాన్ స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. ఈ రెండు పెద్ద చిత్రాలు అమెజాన్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటే గనక పెద్ద నిర్మాతలు కూడా తమ సినిమాలని డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ద్వారా రిలీజ్ చేయడానికి ముందుకు వస్తారు. చూడాలి మరేం జరగనుందో..!

మరింత సమాచారం తెలుసుకోండి: