ఒకప్పుడు సినిమాలో కామెడీ సపరేట్‌ ట్రాక్‌ ఉండేది. హాస్య కథానాయకులు వచ్చిన తరువాత  కామెడీ సినిమాల ట్రెండ మొదలైంది. రాజేంద్ర ప్రసాద్‌ లాంటి కొంత మంది హీరోలు కేవలం కామెడీ సినిమాలతోనే స్టార్ ఇమేజ్ అందుకున్నారు. అయితే ఆ ట్రెండ్‌ను కూడా పక్కన పెట్టి మాస్ ఇమేజ్ ఉన్న కమర్షియల్ స్టార్‌ హీరోలతో కూడా కామెడీ చేయించారు మన దర్శకులు. ఇవీవీ లాంటి వారు ఒకటి రెండు సినిమాల్లో స్టార్ హీరోలతో కామెడీ చేయించాడు.

 

అయితే మెగాస్టార్‌లు, సూపర్‌ స్టార్‌లతో కూడా కమర్షియల్ కామెడీ ఎంటర్‌టైనర్‌లు తెరకెక్కించిన దర్శకుడు శ్రీను వైట్ల. కెరీర్‌ స్టార్టింగ్‌లో నీ కోసం, ఆనందం, సొంతం లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించిన శ్రీను వైట్ల రవితేజ హీరోగా తెరకెక్కిన వెంకీ సినిమాతో పూర్తి స్థాయి కామెడీ దర్శకుడిగా మారాడు. ఆ తరువాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితోనే ఓ కామెడీ సినిమాను రూపొందించాడు శ్రీను వైట్ల.

 

అందరివాడు సినిమాతో మెగాస్టార్‌ చిరంజీవిలోని ఒకప్పటి కామెడీ టైమింగ్‌ను తిరిగి చూపించాడు శ్రీనువైట్ల. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా వర్క్ అవుట్ కాకపోవటంతో తిరిగి రూట్‌ మార్చాడు. యంగ్ హీరోలతో ఢీ, దుబాయ్ శీను, రెడీ లాంటి సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకున్నాడు. అదే కాన్ఫిడెన్స్‌తో మరోసారి సీనియర్ స్టార్ హీరో నాగార్జునతో కింగ్ సినిమాను రూపొందించాడు.

 

కింగ్‌ తరువాత వరుసగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేశాడు శ్రీను వైట్ల. నమో వేంకటేశాయ, దూకుడు, బాద్‌ షా లాంటి సూపర్‌ హిట్లను రూపొందించాడు. అయితే మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఆగడు సినిమాతో శ్రీను వైట్ల కెరీర్‌ పూర్తిగా తిరగబడింది. ఆ సినిమా డిజాస్టర్ కావటం ఆ తరువాత వరుసగా చేసిన బ్రూస్‌లీ, మిస్టర్, అమర్‌ అక్బర్‌ ఆంటోని సినిమాలు కూడా డిజాస్టర్ కావటంతో శ్రీను వైట్లకు అవకాశం ఇచ్చేవారే కరువయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: