మన తెలుగులో వెంకటేష్ కి వచ్చిన పేరులో ప్రత్యేకంగా కామెడి హీరో అనే పేరు కూడా ఉంటుంది. చాలా తక్కువ కాలంలో ఆయన ఆ పేరు తెచ్చుకున్నాడు అనేది అందరికి తెలిసిన విషయమే. హీరో అయినా సరే కమెడియన్ తో సమానంగా కామెడి చేస్తూ ఉంటారు వెంకటేష్. ముందు నుంచి కూడా ఆయన కామెడి విషయంలో అదే విధంగా చేసారు అనేది అర్ధమవుతుంది. స్టార్ హీరో గా ఇమేజ్ వచ్చినా సరే ఆయన మాత్రం కామేడి ని ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు అనేది వాస్తవం. ఇప్పుడు కూడా ఆయన సినిమాల్లో కామెడి కి మంచి ప్రాధాన్యత ఉంటుంది అనే సంగతి తెలిసిందే. 

 

ఆయన హీరోగా వచ్చిన సినిమాల్లో కామెడి గురించి ప్రత్యేకంగా చెప్పుకునే సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమాలో వెంకటేష్ నటన చాలా బాగా ఆకట్టుకుంటే ఆ సినిమాలో ఆయన చేసిన కామెడికి మాత్రం చాలా మంది ఫిదా అయిపోయారు. ప్రతీ సీన్ లో కూడా ఆయన నవ్వించారు అనే చెప్పాలి.  ప్రకాష్ రాజ్ తో పాటు గా ఆయన ఆ సినిమాలో చాలా మంచి కామెడి చేసాడు అనేది అర్ధమవుతుంది. చిన్న  చిన్న సన్నివేశాల్లో కూడా చాలా అందంగా కామెడి చేసాడు వెంకటేష్ అనేది సినిమా చూసిన ఎవరికి అయిన సరే స్పష్టంగా అర్ధమవుతుంది. 

 

ప్రతీ సీన్ లో కూడా కామెడి ని చూసి ప్రేక్షకులు పొట్ట పట్టుకుని నవ్వారు. అమ్మకు రాసిన లేక గాని ఆర్తి అగర్వాల్ తో సునీల్ తో గాని చేసిన కామెడి గాని సినిమాలో చాలా హైలెట్ అయింది అని చెప్పాలి. అసలు ఆ సినిమాలో ఉండే కామెడి కోసమే సినిమాను ఇప్పటికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే ఏ తరం వారు అయినా సరే మిస్ అవరు.

మరింత సమాచారం తెలుసుకోండి: