మన తెలుగులో  తక్కువ కాలంలో స్టార్ ఇమేజ్ తెచ్చుకుని దాన్ని కాపాడుకోలేక ఇబ్బంది పడిన హీరో తరుణ్. ఆయనకు వచ్చిన ఇమేజ్ ఏ స్టార్ హీరో కి కూడా అంత తక్కువ కాలంలో రాలేదు అనేది వాస్తవం. ఏ హీరో కూడా ఆ విధంగా  అంత తక్కువ కాలంలో స్టార్ హీరో అనే విధంగా సినిమాలను చేయలేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. అగ్ర హీరో గా చాలా మంచి పేరు తెచ్చుకున్నా సరే ఆయన మాత్రం ఎక్కువ కాలం సినిమాల్లో ఉండటానికి ఇబ్బంది పడ్డాడు అనే చెప్పాలి. కొన్ని కొన్ని సినిమాల్లో ఆయన నటన చూసి  చాలా మంది స్టార్ హీరోలు వెనక్కు వెళ్ళిపోతారు అనే విధంగా పేరు కూడా వచ్చింది అనే చెప్పాలి. 

 

ఆయన నటించిన మూడు నాలుగు సినిమాల్లో కమెడియన్ అవసరం లేకుండా కామెడి చేసి చూపించారు అనే విషయం అందరికి తెలిసిందే. సునీల్ తో కలిసి చేసిన కొన్ని కొన్ని సన్నివేశాలకు మంచి గుర్తింపు వచ్చింది అనే చెప్పాలి. చిన్న హీరో అయినా సరే ఆయన చేసిన కామేదిని అందరూ ఆదరించారు అనే విషయం చెప్పవచ్చు. అగ్ర హీరో గా ఇమేజ్ వచ్చింది  కెరీర్ లో వరుసగా ఇబ్బందులు పడ్డాడు ఆయన అనేది వాస్తవం. ఇక నటుడిగా మంచి పేరు చిన్న వయసు లోనే రావడం స్టార్ హీరోలతో సమానంగా ఇమేజ్ రావడం దానిని అతను కాపాడుకోలేకపోవడం జరిగాయి. 

 

ఈ మధ్య కాలంలో అతని సినిమాలకు ఏ మాత్రం ఆదరణ లేదు. అసలు ఇప్పుడు ఆయన సినిమాలు చేసినా సరే ఎవరూ కూడా చూసే పరిస్థితి లేదు అనే విషయం అర్ధమవుతుంది. అందుకే తరుణ్ కూడా సినిమాలు చేయడం లేదు అని అంటున్నారు సినీ పరిశీలకులు. మరి ఎప్పుడు సినిమా చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: