సినిమా ఏది అయినా పాత్ర ఏది అయినా సరే అగ్ర దర్శకుడు అయినా చిన్న దర్శకుడు అయినా సరే టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ చేసే కామెడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ దర్శకుడు అయినా సరే ఆయన కామెడి విషయంలో మాత్రం అందరికంటే ముందు ఉంటాడు. చిరంజీవి తర్వాత మన తెలుగులో స్టార్ హీరోల్లో కామెడి చేసే హీరో ఆయనే అనే విషయం అందరికి తెలుసు. చాలా సన్నివేశాల్లో తారక్ నటన చూసిన చాలా మంది ఆయనను ఆకాశానికి ఎత్తేసిన సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు.

 

ఏ సీన్ లో అయినా సరే తారక్ కామెడి కచ్చితంగా హైలెట్ అవుతుంది అనే విషయం  అందరికి తెలుసు. ఆయన హీరోగా వచ్చిన సినిమాల్లో  అదుర్స్ లో తారక్ చేసిన కామెడి చాలా బాగా హిట్ అయింది అనే చెప్పాలి. ఆ సినిమాలో తారక్ నటన చూసిన విమర్శకులు అయితే ముక్కున వేలేసుకునే విధంగా ఆ సినిమాలో కామెడి చేసాడు తారక్ అనేది వాస్తవం. ఆ సినిమాలో ఉన్న సన్నివేశాల్లో ప్రత్యేకంగా ఆయన పూజారి గా నటించిన పాత్రలో చేసిన కామెడి కి మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి. ఏ హీరో కూడా చేయలేని విధంగా ఆ సినిమాలో కామెడి చేసి చూపించారు ఆయన. 

 

సినిమా చాలా బాగా హిట్ అయింది. తారక్ కెరీర్ లో వచ్చిన అతి పెద్ద హిట్స్ లో అది కూడా ఒకటి. ఇక ఆ సినిమా తర్వాత తారక్ కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకునే అవసరమే రాలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు తారక్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: