సాధారణంగా మన తెలుగులో కామెడికి చాలా వరకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే కామెడికి చాలా వరకు ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఇక అగ్ర హీరోల సినిమాల విషయానికి వస్తే కామెడి లేనిదే సినిమా లేదు అనే విధంగా ఉంటాయి కొన్ని కొన్ని. అందుకే మన స్టార్ హీరోలు ఎక్కువగా కామెడి చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే పేరు చిరంజీవి. ఆయన సినిమాలో కామెడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అనేది వాస్తవం. 

 

ఆయన కమెడియన్ లేకుండా కామెడి చేసే సత్తా ఉన్న హీరో అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆయన హీరోగా వచ్చిన అందరివాడు సినిమాలో ఆయన కామెడి చూసి అభిమానులకు ఒకరకంగా పండగ మాదిరిగా ఉంది అనేది వాస్తవం. ప్రతీ సీన్ లో కూడా చిరంజీవి జీవించారు అనే విధంగా ఉన్నాయి సన్నివేశాలు. టబు ని వివాహం చేసుకునే క్రమంలో ఆయన చేసిన కామెడి అయితే సినిమాకు చాలా హైలెట్ గా నిలిచింది అనే చెప్పాలి. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే అందులో ఉండే కామెడి మాత్రం చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. 

 

ఆ సినిమాలో ఆయన చేసిన కామెడికి అవార్డ్ ఇచ్చినా తక్కువే అంటూ చాలా మంది విమర్శకులు వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి అనే చెప్పాలి. ఆ సినిమా ఎన్నో అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా  పడింది. ఇక ఆ సినిమా కథలో పట్టు లేకపోవడంతో సినిమా ఫెయిల్ అయింది అని చాలా మంది కామెంట్ చేసారు ఆ విధంగా ఆ సినిమాలో కామెడి హిట్ అయింది గాని సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: