ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినిమాల్లో కమెడియన్ అవసరం అనేది చాలా తక్కువ గా ఉంటుంది అనేది వాస్తవం. స్టార్ హీరోలు ఎక్కువగా కామెడి చేస్తున్న నేపధ్యంలో కమెడియన్ ల పాత్ర అనేది చాలా వరకు మన తెలుగు సినిమాల్లో తక్కువ అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అగ్ర హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా సరే కామెడి విషయంల హీరోలే జాగ్రత్తలు పడుతూ సినిమాలను చేస్తున్నారు. ఇక గతంలో మాదిరిగా ఈ మధ్య సినిమాల్లో కమెడియన్ అనే వారు లేరు అనే చెప్పాలి. ఇక అది అలా ఉంటే... 

 

అల్లు అర్జున్ సినిమాలో ప్రత్యేకంగా కమెడియన్ అవసరం అనేది లేదు అని అంటారు టాలీవుడ్ లో ఎవరు అయినా సరే. ఆయన హీరో గా వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా చూసిన వారికి అయితే అసలు ఆయన తో కామెడి చేయిస్తే ఇంకా కమెడియన్ ఎందుకు అనే ప్రశ్న చాలా మంది నోటి నుంచి మనం వినే పరిస్థితి ఉంటుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో బన్నీ నోటి నుంచి వచ్చిన కొన్ని కొన్ని మాటలు ఆ సినిమాలో ఉండే సన్నివేశాలు అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. 

 

ప్రతీ సీన్ లో కూడా ఏదోక విధంగా బన్నీ కామెడి చేసాడు అని సినిమా చూసిన అందరికి అర్ధమవుతుంది. ఆ సినిమా బన్నీ కెరీర్ లో అతి పెద్ద విజయం గా చెప్పుకోవచ్చు. ఆ సినిమా తర్వాత అతనికి మంచి హిట్స్ వచ్చాయి. అయితే నా పేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు బన్నీ పుష్ప అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: