మాస్ మహారాజ రవితేజ ఈ పేరు కామెడీకి కేర్ అఫ్ అడ్రస్. తనదైన స్టైల్ లో కామెడీ పండిస్తూ అభిమానుల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నాడు. చిత్ర పరిశ్రమలో స్వ శక్తితో ఎదిగిన హీరో రవితేజ. సినీ పరిశ్రమలో మొదటగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేశారు. ఇష్టం, చేసే పని మీద ఫ్యాషన్, పట్టుదల ఈ మూడు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన కథానాయకుడు. 

 

 

ఇకపోతే రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. రవితేజ కామెడీకి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అట ఇది. ఇక కిక్ తరువాత రవితేజ మళ్లీ ఆ రేంజ్ కామెడీ సినిమా చెయ్యలేదు.

 

 

యాక్షన్ సన్నివేశాలతో అదరగొడుతూ మాస్ ప్రేక్షకులందరికీ మాస్ మహారాజా కూడా మారిపోయాడు. మాస్ మహారాజా రవితేజ కామెడీ టైమింగ్ కి సినీ ప్రేక్షకులు అందరూ ఫిదా అవ్వాల్సిందే అని చెప్పాలి. తనదైన కామెడీ టైమింగ్ తో.. అదిరిపోయే ఆటిట్యూడ్తో.. ప్రతి సన్నివేశంలో  ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటాడు రవితేజ.

 

 

ముఖ్యంగా రవితేజ కెరియర్ లో విక్రమార్కుడు  సినిమా రవితేజ లోని పూర్తిస్థాయి కమెడీయన్ న్ని సినీ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఓ వైపు పోలీస్ ఆఫీసర్ పాత్రలో తనదైన యాక్షన్ సన్నివేశాలతో అదరగొడుతూనే... మరోవైపు దొంగగా కూడా తన కామెడీ టైమింగ్ తో అదరగొడుతూ  తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు రవితేజ. ఇక ప్రతి  సినిమాలో తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. 

 

 

రవితేజ చిత్రపరిశ్రమలో తనతో సన్నిహితంగా ఉంటున్నవంటి కొంత మంది డైరెక్టర్లని కలిసి యాక్షన్ తరహాలో కాకుండా కామెడీ ఎంటర్టైనర్ తరహాలో ఉన్నటువంటి కథలను వినిపించ వలసిందిగా కోరాడట. విజయాల పరంగా రవితేజ జోరు తగ్గిందనే చెప్పాలి. మాస్ లో మంచి ఇమేజ్ ఉన్న రవితేజ మార్కెట్ మాత్రం చెక్కు చెదరలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: