ఆంగ్ల రచయిత షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ నవల ఆధారంగా 1997వ సంవత్సరంలో ఎన్ ఎస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రమైన ఉల్టా పల్టా... తెలుగులో కూడా అదే పేరుతో 1998వ సంవత్సరంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, బాబు మోహన్ లు ద్విపాత్రాభినయం చేసారు. శ్రీ కన్య, రేష్మ, రాణి ఫిమేల్ ప్రధాన పాత్రలలో నటించారు. 


సినిమా కథ గురించి తెలుసుకుంటే... చిన్నతనంలో విడిపోయిన కవల అన్నదమ్ములైన రాజేంద్ర ప్రసాద్ లు, మరొక కవల అన్నదమ్ములైన బాబు మోహన్ లు ఒకరి జీవితంలో మరొకరు అరంగేట్రం చేస్తే ఎంత తికమకగా,హాస్యభరితంగా ఉంటుందనేది ఈ సినిమా కథాంశం కాగా... గందరగోళ సన్నివేశాలు చాలా చక్కగా చూపించబడ్డాయి. ఐతే తెలుగులో రేలంగి నరసింహారావు ఉల్టా పల్టా కి దర్శకత్వం వహించాడు. ఉల్టా పల్టా లో ఇద్దరు రాజేంద్రప్రసాద్ లు రాజా అనే ఒకే పేరు పెట్టుకోగా... ఇద్దరు బాబు మోహన్ లు కూడా రాము అనే ఒకే పేరు పెట్టుకుంటారు. ఒక్కొక్క రాజేంద్రప్రసాద్ ల వద్ద ఒక్కొక్క బాబు మోహన్ పని మనిషిగా పనిచేస్తుంటారు.


అయితే రాజా తన పని మనిషి తో కలిసి ఎప్పుడైతే సిటీ కి వెళ్తాడో అప్పుడే తను తన కవల సోదరుడైన రాజా (రాజేంద్రప్రసాద్) జీవితంలో అడుగుపెడతాడు. ఇక అప్పటి నుండి ఈ నలుగురి జీవితాలలో ఎన్నో గందరగోళమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సినిమా మొత్తంలో రాజేంద్రప్రసాద్, బాబు మోహన్ లు ద్వితీయ పాత్రలలో చాలా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులకు తమలో ఎంత గొప్ప నటులు ఉన్నారో చెప్పకనే చెప్పారు. వీరి నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే అన్నట్లు ఉందని చెప్పడంలో ఏ అతిశయోక్తి లేదు. 


చిలిపి రాముడి గా, ఎప్పుడూ ఏడుస్తూ ఉండే అమాయకపు రాముడిగా ఒకే సినిమాలో బాబు మోహన్ చూపించిన నటనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ రెండు పాత్రలు పోషించిన బాబు మోహన్ వెండితెరపై మ్యాజిక్ చేసి తెలుగు ప్రేక్షకులకు కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు. ఈ సినిమాలో హీరోయిన్ల అందాల ఆరబోతకు కొదవేమీ లేదని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: